BigTV English

US warning to Pakistan: పాక్‌కి అమెరికా వార్నింగ్, అసలేం జరిగింది?

US warning to Pakistan: పాక్‌కి అమెరికా వార్నింగ్, అసలేం జరిగింది?

ఒకప్పుడు ఏ దేశం ఎక్కడ ఉండేదో అమెరికాకు తెలీయదు. టెక్నాలజీ పుణ్యమాని ఎవరు ఏం చేసినా క్షణాల్లో అగ్రరాజ్యానికి ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ముందు ఆంక్షల ప్రమాదం గురించి ఆలోచించాలన్నది అందులో సారాంశం.


బాలిస్టిక్ మిసైల్స్ తయారీకి వస్తువుల సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని యూఎస్ విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతిని వేదాంత్ పటేల్ హెచ్చరించారు. విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా ఆంక్షలు విధిస్తామని వేదాంత్‌పటేల్ క్లారిటీ ఇచ్చారు. విపులంగా చెప్పాలంటే ఇరాన్‌‌తో వ్యాపార ఒప్పందాలపై ఆంక్షలు ఉంటాయనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఆ మేరకు అన్ని దేశాలకు సలహా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వినాశకరమైన ఆయుధాలు, వాటి పంపిణీ పెంపుదల నేపథ్యంలో ఆంక్షలు విధించాల్సి వస్తుందన్నారు. పాకిస్థాన్ మిస్సైల్ ప్రొగ్రామ్ సరఫరా దారులుగా ఉన్న కంపెనీలు చైనా, బెలారస్‌లో ఉన్నాయని ప్రస్తావించారు. బాలిస్టిక్ క్షిపణి తయారీ కోసం సంబంధిత వస్తువులను సేకరించినట్టు గుర్తించామని వెల్లడించారు.


మూడురోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉన్నత స్థాయి టీమ్‌తో పాకిస్థాన్‌కు వెళ్లారు. రెండురోజులపాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య 8 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కొన్ని అంశాల విషయంలో చర్చలు కొనసాగుతున్నట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా హెచ్చరిక జారీ చేసినట్టు చెబుతున్నారు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×