Big Stories

Massive Landslide: విషాదం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి!

More than 100 Killed in Papua New Guinea Landslide: పపువా న్యూ గినియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు.

- Advertisement -

ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. పోర్ట్ మోర్స్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలోని శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు ABC నివేదించింది.

- Advertisement -

ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మృతి చెంది ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల బృందం సహాయక చర్యలు చేపడుతన్నారు. బండరాళ్ల మధ్య మృతి దేహాలను బయటికి తీసేందుకు, బండరాళ్లు, తొలగించేందుకు స్థానిక ప్రజలు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also Read: చైనా కవ్వింపు చర్యలు.. తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు

మారుమూల గ్రామంలో సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News