BigTV English

Chile: చిలీ అడవుల్లో కార్చిచ్చు. .13 మంది దుర్మరణం

Chile: చిలీ అడవుల్లో కార్చిచ్చు. .13 మంది దుర్మరణం

Chile: లాటిన్ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. వేల హెక్టార్ల అటవీ ప్రాంతం పూర్తిగా దగ్ధమయింది. అగ్ని కీలలు వేగంగా వ్యాప్తి చెందుతూ రహదారుల మీదకు దూసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు వందల ఇళ్లు అగ్నికి ఆహుతవ్వగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.


బయోబయో, నుబుల్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగి ఇప్పటి వరకు 14 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఇది గతంలో సంభవించిన ప్రమాదం కంటే రెండు రెట్లు అధికం. అగ్నికీలలు వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇక మంటలను ఆర్పుతున్న క్రమంలో ఓ అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే అత్యవసర సేవల బృందానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లకు మంటలు అంటుకొని కొందరు సామాన్య ప్రజలు దుర్మరణం చెందారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.


ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్నామని.. రానున్న రోజుల్లో పరిస్థితి చేయిజారి పోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఇంకా వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అన్నారు. దగ్గర్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×