BigTV English

Super Cows:ఏడాదికి 18 టన్నుల పాలిచ్చే ‘సూపర్ కౌ’..

Super Cows:ఏడాదికి 18 టన్నుల పాలిచ్చే ‘సూపర్ కౌ’..

Super Cows:చైనా శాస్త్రవేత్తలు పరిశోధనల విషయంలో ఇతర దేశాల కంటే ముందుకు దూసుకుపోవాలనుకుంటున్నారు. అందుకే కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోనే కాకుండా ఎన్నో ఇతర రంగాల్లో కూడా వారు కొత్త కొత్త పరిశోధనలను ప్రారంభించారు. తాజాగా మూడు ఆవులను క్లోనింగ్ చేసిన పరిశోధకులకు ఓ కొత్త విషయం తెలిసింది.


మామూలుగా ఆవులు తమకు తగినంత పాలను అందించగలవు. కానీ అలా కాకుండా వ్యాపారులు ఈమధ్య వాటికి ఆర్టిఫిషియల్ మందులను అందించి వాటి స్థోమతను మించిన పాలను తీయాలని చూస్తున్నారు. అందుకే చాలావరకు ఆవులు మోతాదు వయసుకంటే తక్కువగా జీవించి.. ఆ తర్వాత అనారోగ్యం బారినపడి చనిపోతున్నాయి. అలా కాకుండా క్లోనింగ్ వల్ల పాల సేకరణలో మార్పులు ఉండవచ్చని ఆలోచనతో చైనా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.

తాజాగా శాస్త్రవేత్తలు ఓ మూడు ఆవులను క్లోనింగ్ జరిపించారు. దాని వల్ల వారు ఊహించినదానికంటే ఎన్నో ఎక్కువ రెట్ల పాలను ఆ ఆవును అందించినట్టుగా వారు తెలిపారు. మామూలుగా అమెరికన్ ఆవులు ఇచ్చినదానికంటే 50 శాతం ఎక్కువ పాలను అవి ఇస్తున్నట్టుగా గుర్తించారు. సోమాటిక్ సెల్ న్యూక్లియన్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ద్వారా ఇది సాధ్యమయ్యిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం చైనాలోని పలు ఆవులను శాంపుల్ టిష్యూలను సేకరించామని వారు అన్నారు.


గతేడాది నుండి ఈ క్లోనింగ్‌పై పరిశోధనలను జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వారు పరిశోధన చేసిన మూడు ఆవులు నెథర్‌ల్యాండ్స్‌లోని హాల్‌స్టీన్ ఫ్రైషియన్ బ్రీడ్‌కు సంబంధిందనవని తెలుస్తోంది. ఇవి మామూలుగా ఎక్కువ పాలను అందిస్తాయి అందుకే ఈ ఆవులను వారు సెలక్ట్ చేసుకున్నామని అన్నారు. ఇవి ఏడాదికి 18 టన్నుల పాలను ఇవ్వగలవని చైనా మీడియా అంటోంది. అంటే అమెరికన్ ఆవును ఇచ్చేదానికంటే 1.7 శాతం ఎక్కువ.

ఈ మూడు ఆవులకు చైనా శాస్త్రవేత్తలు ‘సూపర్ కౌస్‌’గా పేరుపెట్టారు. వ్యవసాయానికి సామర్థ్యం ఉన్న ఆవులను తయారు చేయడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. ఆవుల కోసం చైనా ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడి ఉంటుంది. దాదాపు ఆ దేశంలోని 70 శాతం ఆవులు ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్నవే. ఓ సర్వే ప్రకారం.. ప్రస్తుతం చైనాలో 6.6 మిలియన్ ఆవులు ఉన్నాయి. కానీ 10,000 ఆవుల్లో 5 మాత్రమే సామర్థ్యం కలిగినవిగా ఉన్నాయి.

ఈ సూపర్ కౌస్ జీన్స్‌ను జాగ్రత్తగా దాచిపెట్టి.. భవిష్యత్తులో ఇలాంటి ఆవులను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా క్లోనింగ్‌లో అనేక పరిశోధనలు చేస్తున్న చైనాకు సూపర్ కౌస్ పరిశోధన బ్రేక్ ఇచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బయోటెక్నాలజీ రంగంలో కూడా మరిన్ని పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×