BigTV English

Prabhas: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ K’.. నిజమెంత!

Prabhas: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ K’.. నిజమెంత!

Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో ‘ప్రాజెక్ట్ K’ ఒక‌టి. మ‌హాన‌టి వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెర‌కెక్కించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీపికా ప‌దుకొనె హీరోయిన్‌. సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. తాజాగా ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందంటూ వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కానీ సినీ క్లోజ్డ్ స‌ర్కిల్స్ ప్ర‌కారం ‘ప్రాజెక్ట్ K’ రెండు భాగాల్లో కాకుండా ఓ భాగంగానే విడుద‌ల‌వుతుందంటున్నారు.


‘ప్రాజెక్ట్ K’ సినిమాలో ప్ర‌భాస్ సూప‌ర్ హీరో పాత్ర‌లో క‌నిపిస్తార‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ లేవు. ఈ ఏడాదిలోనే ‘ప్రాజెక్ట్ K’ సినిమా రిలీజ్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న అయితే లేదు. భారీ అంచ‌నాల‌తో ‘ప్రాజెక్ట్ K’ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు. ఇందులో దీపికా ప‌దుకొనెతో పాటు దిశా ప‌టాని కూడా మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది.


Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×