20 Killed in Pakistan Bus Accident: పాకిస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండ పై నుంచి లోయలోకి జారిపడటంతో.. 20 మంది వరకూ మరణించారు. గిల్గిత్ – బాల్టిస్థాన్ ప్రాంతం.. డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి హుంజాకు వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను చిలాస్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ సీఎం హాజీ గుల్బర్ ఖాన్ దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యుల్ని ఆదేశించారు.