China New Virus: కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరికొన్ని కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కొత్త వైరస్ వ్యాప్తి ఇక చైనాలో యూనాన్ ప్రావిన్స్‌లో గబ్బిలాల శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాదాపు22 కుపైగా కొత్త వైరస్ వేరియంట్లను కనిపెట్టారు. వాటిలో రెండు ప్రాణాంకమైనదిగా చెబుతున్నారు. వాటిలో నిఫా.. అలాగే హెన్డ్రా వైరస్‌లతో ముడిపడి ఉన్నట్టుగా చెబుతున్నారు. భవిష్యత్తులో వణ్య ప్రాణుల నుంచి మానవులకు వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే ఆందోళన చెందుతున్నారు.
ప్రాణాంతక వైరస్:
చైనాలోని యూనాన్ ప్రావిన్స్‌లో గబ్బిలాల్లో శాస్త్రవేత్తలు మొత్తం 22 వైరస్‌లు కనిపెట్టారు. పోలాలు, గ్రామాల సమీపంలో నివసించే పండ్ల గబ్బీలాల కనుగొన్నారు. ఇక్కడ ప్రజలు, జంతువులు తరచుగా వణ్యప్రాణులతో సంబంధం కలిగి ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయం అటవి నిర్మూలన.. అలాగే పట్టనీకరణ ప్రజలకు వణ్యప్రాణులను దగ్గర చేసే ప్రాంతాల్లో జంతువుల నుంచి మానవులకు కొత్త వైరస్ సోకే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ మార్పులు, అడవీ జంతువులను ప్రజలతో సన్నిహితంగా ఉంచుతున్నందున జునోటిక్ బెదిరింపులు జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వ్యాధులు పెరుగుతున్న ప్రమాదం పై శాస్త్రవేత్తలు ఒక్కసారిగా రెడ్ ఫ్లాగ్ ఎగురవేసారు.
Also Read: కాంగ్రెస్‌లో అయోమయం అసలేం జరిగింది?
నిఫా, హెన్డ్రాతో ప్రాణాలు అరచేతిలో..
ప్రధానంగా సార్స్, ఎబోలా, కోవిడ్-19 వంటి మునుపటి వ్యాప్తితో కూడా ఇదే పరిస్థితి.. ప్రాణాంతకమైన నిఫా మరియు హెన్డ్రా అనేవి మానవుల్లో, జంతువుల్లో తీవ్రమైనటువంటి మెదడు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకం కూడా అవుతాయి. కొన్ని వ్యాప్తి మరణాల రేటు 75% వరకు ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.