BigTV English

USA : అమెరికాపై పిడుగుల వర్షం.. విమాన సర్వీసులు ఆగమాగం..

USA : అమెరికాపై పిడుగుల వర్షం.. విమాన సర్వీసులు ఆగమాగం..


USA

USA : అమెరికాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పిడుగులు కూడా తోడవడంతో అమెరికా ఈశాన్య ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పిడుగుల ప్రభావంతో దీంతో దాదాపు 2వేల 6వందల విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతోపాటు మరో 8వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూయార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే 350 సర్వీసులు రద్దయ్యాయి.


ఇక జాన్‌ కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌ 318 రద్దు కాగా.. 426 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక లా గార్డియన్‌లో 270 సర్వీసులు రద్దుకాగా.. 292 ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు.. మరోసారి విమాన సమయాలను, వాతావరణ పరిస్థితులను చెక్‌ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి.

మరోవైపు ఈశాన్య అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలొస్తున్నాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెటికట్‌, పెన్సిల్వేనియా, మాస్సాచుసెట్స్‌, వెర్మాంట్‌ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక కనెటికట్‌, మస్సాచుసెట్స్‌, న్యూహాంప్‌షైర్‌, న్యూయార్క్‌, రోడే దీవిలో టోర్నడో వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×