Car crash at Texas: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ముగ్గురు హైదరాబాద్ వాసులు కాగా, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌కు చెందిన ఫరూఖ్, ఆర్యన్ రఘునాథ్, లోకేశ్ పాలచర్ల కాగా, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నాడు.
ప్రమాదం వెనుక అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం. కార్ పూలింగ్ ద్వారా దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు బెన్‌టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు వాహనంలో ఎక్కారు. అసలే విశాలమైన హైవే రోడ్లు, దీనికితోడు అతివేగం తోడయ్యింది. వరుసగా ఐదు వాహనాలు వెళ్తున్నాయి.
ALSO READ: జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నం..129 మంది ఖైదీలు మృతి
ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు కారులో నుంచి నలుగురు భారతీయులు బయటపడలేకపోయారు. వీరి మృత దేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. అయితే కారు పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల భారతీయుల వివరాలు బయటకు వచ్చాయి. వీరి మృతిపై ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల్లో ఆర్యన్ రఘునాథ్.. హైదరాబాద్‌కి చెందని మాక్స్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ సంస్థ యజమాని సుభాష్ కొడుకు. వీరి సొంతూరు కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతం. చాన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో సెటిలయ్యారు. రీసెంట్‌గా తమిళనాడులోని అమృత యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆర్యన్, ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల కిందట అమెరికా వెళ్లాడు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరయ్యారు.
తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాల ముందు పేరెంట్స్‌తో మాట్లాడారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సాయం చేయాలని కేంద్రాన్ని వాసుదేవన్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు.మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శుక్రవారం చోటుచేసుకున్న… pic.twitter.com/6sIR6NT3FZ
— ChotaNews (@ChotaNewsTelugu) September 4, 2024