BigTV English

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

SCO Summit 2025: మోడీ.. జిన్ పింగ్.. చేయిలో చెయ్యేసి మాట్లాడుకుని ఏడేళ్లు అయింది. మోడీ చైనా కు వెళ్లకు ఏడేళ్లు. 2020లో గాల్వన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు దెబ్బతిన్నాయ్. అటువైపు మోడీ వెళ్లనే లేదు. సీన్ కట్ చేస్తే తాజాగా SCO సమ్మిట్ లో భాగంగా అంతా టియాంజిన్ లో కలుసుకున్నారు. ఇది భారత్ చైనా సంబంధాల్లో కీలకంగా మారింది. జిన్ పింగ్ ఫేవరెట్ కారులో మోడీ రావడం, పుతిన్ తో చర్చలు జరపడం.. యావత్ ప్రపంచం కళ్లన్నీ అటువైపే ఉన్నాయంటే మాటలు కాదు. ఇంతలా ఈ రెండు దేశాలు కలిసిపోవడానికి కారణం ట్రంప్. ఆయన విధించిన టారిఫ్ లే.


ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్‌తో మారిన సీన్

నిజానికి అసలు భారత్ చైనా మధ్య సంబంధాలు బాగవుతాయా అని అంతా అనుకున్న టైంలో అనుకోని విషయం మన రెండు దేశాలను దగ్గర చేసింది. అదంటా ట్రంప్ మహిమే. ఏ ఘడియలో 50 శాతం టారిఫ్ లు అంటూ మనపై కక్ష పెంచుకున్నాడోగానీ.. చైనాతో దోస్తీ మరింత బలం పెరిగేలా చేసింది. పరిస్థితులను గమనించిన డ్రాగన్.. భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. భారత్ కు సంఘీభావం ప్రకటించింది. అటు మోడీ కూడా SCO సమ్మిట్ కు వెళ్తానని ప్రకటించడం, చైనా దీన్ని ఆహ్వానించడం, అక్కడికి వెళ్లడం, జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరపడం.. రెండు దేశాలు కలిసి నడవాలని నిర్ణయించడం.. అమెరికన్ టారిఫ్ లపై ఘాటుగా రియాక్ట్ అవడం ఇవన్నీ జరిగాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య స్నేహబంధంలో కొత్త శకం ప్రారంభమైనట్లు అయింది.


భారత్‌నే టార్గెట్ చేస్తున్న ట్రంప్

భారత్ చైనా ఇలా దోస్తీ పెరగడానికి కారణం ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలే. రష్యాతో బిజినెస్ చేస్తున్న, రష్యన్ ఆయిల్ కొంటున్న ఇతర దేశాలను వదిలేసి కేవలం ట్రంప్ భారత్‌నే టార్గెట్ చేశారు. దీంతో కథ అంతా మారిపోయింది. అమెరికా పరువు పోయింది. ఇలా అన్యాయంగా టారిఫ్ లు వేయడం ఏంటన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. శత్రువు శత్రువు మిత్రుడన్నట్లుగా.. ట్రంప్ తీరుతో భారత్ చైనాలు దగ్గరయ్యాయి. రెండు దేశాల నాయకులు సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి, సహకారాన్ని పెంపొందించడంపై ఫోకస్ పెట్టారు. భారత్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు దేశాలు అభివృద్ధి భాగస్వాములుగా ఉండాలని, విభేదాలు వివాదాలుగా మారకూడదన్నది. అటు చైనా విదేశాంగ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. పంచశీల సూత్రాన్ని ప్రస్తావించింది. 70 ఏళ్ల క్రితం చైనా, భారత నాయకులు సూచించిన శాంతియుత పంచశీల సూత్రాలను గౌరవిస్తూ ప్రోత్సహించాలన్నది.

పంచశీల రూల్స్‌ను గతంలో ఉల్లంఘించిన చైనా

1954 ఏప్రిల్ 29న భారత్, చైనా మధ్య ఒప్పందంలో భాగంగా పంచశీల సూత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కీలకమైన 5 పాయింట్లు ఏంటంటే.. ఒకరి భూభాగ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించడం, ఒకరిపై మరొకరు దాడి చేయకపోవడం, ఒకరి అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, పరస్పర ప్రయోజనం దిశగా అడుగులు వేయడం, శాంతియుత సహజీవనం పాటించుకోవడం వంటివి ఉన్నాయి. అయితే 1962 యుద్ధంతో పంచశీల సూత్రాన్ని చైనా ఉల్లంఘించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ పంచశీల సూత్రాన్ని చైనా ప్రస్తావించడం చూస్తుంటే ఒక మెట్లు దిగినట్లు కనిపిస్తోంది. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనంపై ఫోకస్ పెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో చైనా తీరుపై అలర్ట్ గా ఉంటుంది భారత్.

ట్రంప్ 50 శాతం సుంకాలతో మారిన గేమ్

ట్రంప్ వేసిన 50 శాతం సుంకాలతో గేమ్ మారిపోయింది. మనకు ఎవరూ శాశ్వత శత్రువులు లేరని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పడం కీలకంగా మారింది. సుంకాలతో భారత్ – అమెరికా సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయ్. దీంతో భారత్ కూడా తన ప్రత్యామ్నాయాలను చూసుకుంటోంది. అమెరికా కాకుండా మిగితా దేశాలకు సప్లై చేసేలా ప్లాన్స్ రెడీ అవుతున్నాయ్. భారత్ చైనా దగ్గరవడం చూసిన అమెరికా లేటెస్ట్ గా ఓ కీలక కామెంట్ చేసింది. భారత్ తో తమకు శాశ్వత స్నేహబంధం ఉందన్నది. ఇది మోడీ, పుతిన్, ట్రంప్ యూనిటీగా ఉన్న ఫోటో చూసాక డైనమిక్స్ మారిపోతున్నాయ్. ట్రంప్ ఎఫెక్ట్ తో కథ మారుతోంది. మరి ట్రంప్ టారిఫ్ లతో భారత్ కు బెనిఫిట్ జరుగుతోందా? బ్యాక్ గ్రౌండ్ లో ఏం నడుస్తోంది?

ట్రంప్ టారిఫ్‌లతో మారుతున్న సీన్

భారత్ చైనా మధ్య సవాళ్లు ఉన్నా సానుకూలతలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. బీజింగ్ న్యూఢిల్లీ మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మంచి స్పేస్ ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఎటాక్స్.. భారత్ ను అమెరికా నుంచి దూరం చేస్తాయని, ఈ టైంలో భారత్ కు ఇతర దేశాల భాగస్వామ్యం అవసరమని చైనా అధ్యక్షుడికి తెలుసు. అదే సమయంలో ఉమ్మడి శత్రువుకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో పుతిన్, జిన్ పింగ్ ఉన్నారు. దీంతో SCO సమ్మిట్ రూపంలో ఇది కలిసి వచ్చింది. ట్రంప్ కు నిద్దరలేని రాత్రులు మిగిలుస్తోంది. 2018 తర్వాత మోడీ చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే భారత్ చైనాలు కొంత ఫ్రెండ్షిప్ ఏర్పరుచుకునే క్రమంలో ట్రంప్ టారిఫ్ ల కంటే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ వచ్చాయి. 2024 అక్టోబర్‌లో, భారత్ చైనాలు LAC వెంట డిస్‌ఎంగేజ్‌మెంట్ పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది 2020 గల్వాన్ సంఘటన తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా మారింది. అలాగే కైలాస్ మానస సరోవర యాత్రను పునఃప్రారంభించడం, ఇండియా కూడా చైనా పౌరులకు వీసాలను ఓపెన్ చేయడం, మంత్రుల స్థాయిలో పర్యటనలు జరగడం మొదలయ్యాయి. సో మొత్తంగా ఈ పరిణామాలు భారత్-చైనా సంబంధాలలో ఒక రీసెట్ గా మారుతున్నాయి.

జిన్ పింగ్ మోడీ భేటీతో అమెరికాలో కలవరం

చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, జిన్ పింగ్ తో వరుస సమావేశాలు నిర్వహించాక భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. భారత్ అమెరికా భాగస్వామ్యం శాశ్వతం అని, తమ రెండు దేశాల స్నేహం పరస్పర సహకారంతో ముందుకెళ్తుందన్నారు. సో ఒక ముందుడుగు పడింది. అయితే సవాళ్లు కూడా భారత్ చైనా మధ్య చాలానే ఉన్నాయి. భారత్ విషయానికొస్తే, చైనాతో వాణిజ్య లోటు సమస్య ఉంది. ఇది 99 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు చైనాలో మన మెడిసిన్స్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌ను పెంచాలని భారత్ కోరుతోంది. రెండు దేశాలు ఇప్పటికీ చాలా రంగాల్లో భారీ సుంకాల అమలు ఉంది.

భారత్ మార్కెట్ ఓపెన్ చేయాలంటున్న చైనా

140 కోట్ల జనాభా ఉన్న భారత్.. తన ఉత్పత్తులకు ఓపెన్ చేయాలని చైనా కోరుకుంటోంది. ఈ విషయంలో ఢిల్లీ జాగ్రత్త పడుతోంది. పైగా ఈ ఏడాది చివర్లో భారత్ క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ఈ ఫోరమ్ ఒక సవాల్ గా చెబుతారు. అయితే ట్రంప్ .. భారత్ భాగస్వామ్యం ఉన్న కూటములను లైట్ తీసుకుంటున్నారు. భేటీకి రావడం కూడా డౌటే. అటు భారత్ కు శత్రుదేశంగా ఉన్న పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ ఇస్తూ వస్తోంది. ఇదొక సవాల్ గా ఉంది. సో ఇలాంటివి చిన్న విషయాలను పక్కన పెడితే మోడీ, పుతిన్, జిన్ పింగ్ ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా అయితే మారింది.

రేర్ ఎర్త్ మినరల్స్ ఇచ్చేందుకు చైనా అంగీకారం

జూన్ 26న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్‌ను SCO రక్షణ మంత్రుల సమావేశంలో కలిశారు. ఈ భేటీలో సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రోడ్‌మ్యాప్ అవసరమని రాజ్ నాథ్ చెప్పారు. మరోవైపు ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌ కు వచ్చారు. మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలలో చైనా ఫెర్టిలైజర్లు, రేర్ ఎర్త్ మినరల్స్, టన్నెల్ బోరింగ్ మెషీన్స్ వంటి కీలక వస్తువుల ఎగుమతిపై ఆంక్షలను సడలించడానికి చైనా అంగీకరించింది. దీంతో మనకు రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో రిలీఫ్ దొరికినట్లైంది.

Also Read: కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ.. జరగబోయేది ఇదేనా?

అలాగే జులై 22న చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత్ మళ్లీ మొదలు పెట్టింది. భారత్ చైనా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించే విషయంలోనూ రెండు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగాయి. భారత్ చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. భారత్, చైనా మధ్య ప్రధాన సమస్య 3,440 కిలోమీటర్ల సరిహద్దు. కొన్ని ప్రాంతాలు మావే అని చైనా అప్పుడప్పుడు వాదిస్తుంటుంది. భారత్ తో స్నేహం కోరుకుంటే.. ఇలాంటి మాటలు ఆపేయాలి. అప్పుడే నమ్మకం పెరుగుతుంది. అటు భారత్‌- చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇరుదేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు డ్రాగన్‌లా అభివృద్ధి చెందాలన్నారు. సో ఇవన్నీ మాటల్లో కాదు చేతల్లో చైనా చూపించాల్సిన అవసరం ఉంది.

Story By Vidya Sagar, Bigtv

Related News

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Big Stories

×