Sudan: సూడాన్‌లో ప్రకృతి కన్నెర్ర చేసింది. పశ్చిమ ప్రాంతంలోని మర్రా పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో గ్రామమంతా నేలమట్టం అయ్యింది. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
కొద్దిరోజులుగా సుడాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే కొండ కింద ఓ గ్రామంపై భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన ఆగస్టు 31న జరిగిందని స్థానిక ఆర్మీ అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారని తెలిపారు.గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని వెల్లడించారు.
కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు తగినంత సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి-అంతర్జాతీయ సహాయ సంస్థలను లిబరేషన్ మూవ్‌మెంట్ కోరింది.ఉత్తర డార్ఫుర్ రాష్ట్రంలో సైన్యానికి- రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు.
అదే సమయంలో అక్కడ ప్రకృతి వీరిపై కన్నెర్ర చేసింది. ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వారికి విపత్తు రూపంలో మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల ఆ దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తోంది.
Sudan 🇸🇩 💔
At least 1,000 were killed in a landslide that destroyed a village in the Marra Mountains area of western Sudan, leaving only one survivor.pic.twitter.com/vQ9yTfOAZL #PrayForSudan #Sudan #Landslide
The landslide struck on August 31 after days of heavy rainfall, the…— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) September 2, 2025