Vizag Glass Bridge: ఏపీ సర్కారు విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అద్భుమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయాణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే దేశంలో అతిపెద్ద గాజు వంతెనను నిర్మిస్తోంది. స్కై వాక్ చేసేందుకు వీలుగా 55 మీటర్ల పొడవులో దీని నిర్మానం కొనసాగుతుంది. కైలాసగిరి కొండలకు దగ్గరగా, వైజాగ్ లో సందర్శకులను స్వాగతించడానికి ఈ గాజు స్కైవాక్ వంతెన రెడీ అవుతోంది. రూ. 7 కోట్ల వ్యయంతో, 55 మీటర్ల పొడవైన గాజు కాంటిలివర్ వంతెన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బంగాళాఖాతం తీర ప్రాంతం అద్భుతమైన విశాల దృశ్యాలతో, గాజు వంతెన ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారనుంది.
టైటానిక్ వ్యూపాయింట్‌కు దగ్గరగా నిర్మాణం
ప్రసిద్ధ కైలాసగిరి కొండల దగ్గరలోని టైటానిక్ వ్యూపాయింట్‌కు దగ్గరగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) నిర్మిస్తున్న గాజు వంతెన.. పర్యాటకులకు ఉల్లాసకరమైన అనుభవాన్ని అందిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ బ్రిడ్జికి ప్రణాళికలు వేసింది. అక్టోబర్ 2024లో గాజు వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
స్కై-సైక్లింగ్ ట్రాక్ లు, టూ-వే జిప్ లైన్లు
గాజు వంతెనతో పాటు, సాహసాలు చేయడానికి అనుకూలంగా ఉండేలా 150 మీటర్ల పొడవైన స్కై-సైక్లింగ్ ట్రాక్ లు, టూ-వే జిప్‌లైన్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ గ్లాస్ స్కై బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. దాదాపు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. దీని వలన వైజాగ్ దేశంలోనే అగ్రశ్రేణి టూరిస్ట్ స్పాట్ గా మారే అవకాశం ఉంది.
Read Also: రైలు పట్టాల మీదే కరెంటు తయారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
దేశంలో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో గాజు వంతెనలు
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ వంతెన కార్యకలాపాలు కొనసాగనున్నాయి. టికెట్ అమ్మకాలలో 40 శాతం వాటాను VMRDA పొందుతుంది, బిడ్ ను గెలుచుకున్న కేరళకు చెందిన ప్రైవేట్ బిల్డర్ మిగిలిన మొత్తాన్ని తీసుకుంటుంది. బ్రిడ్జి డిజైన్ ప్రకారం ఒకేసారి 40 మంది వరకు వంతెనపై నడవవచ్చు. ప్రస్తుతం, భారతదేశంలో కేరళ, బీహార్ మరియు సిక్కింలో మూడు గాజు వంతెనలు ఉన్నాయి. ఆంధ్రాలో ఏర్పాటయ్యే గాజు వంతెన వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచనున్నాయి. అద్భుతమైన వ్యూ పాయింట్ తో సాహసోపేతమైన కార్యకలాపాలతో ఆకట్టుకోనుంది. ఎప్పుడెప్పుడు గాజు వంతెన అందుబాటులోకి వస్తుందా? అని వైజాగ్ వాసులు ఎదురు చూస్తున్నారు.
Read Also: పండుగ సీజన్ కోసం 150 ప్రత్యేక రైళ్లు, తెలుగు ప్రయాణీకులకు క్రేజీన్యూస్!