BigTV English

Joe Biden| బైడెన్ పనితీరుపై సందేహాలు!.. అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని డెమోక్రాట్ సెనేటర్ల సూచన

Joe Biden| బైడెన్ పనితీరుపై సందేహాలు!.. అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని డెమోక్రాట్ సెనేటర్ల సూచన

Joe Biden| అమెరికా మీడియా సంస్థల ప్రకారం.. అధ్యక్ష పదవి ఎన్నికల్లో జో బైడెన్ కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. నవంబర్ 5న జరిగే ఎన్నికల బరి నుంచి ఆయన వైదొలగాలని డెమొక్రాట్ పార్టీకి చెందిన అయిదుగురు సెనేటర్లు ప్రకటించారు. ఇటీవల తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో బైడెన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో పొటీపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


డిబేట్ లో బైడెన్ మాట్లాడడానికి తడబడుతున్నట్లు, ఆయనకు వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆయనను దేశ అధ్యక్ష ఎన్నికల్ల నుంచి తప్పించాలని, వేరే అభ్యర్థిని నిలబెట్టాలని పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే చెబుతున్నారు.

తాజాగా ఆయన సొంత పార్టీ డెమోక్రాట్స్ నుంచి అయిదుగురు ఎంపీలు.. జెర్రీ నాడ్లర్, మార్క్ టకానో, జో మోరెల్లే, టెడ్ లియు మరియు ఆడమ్ స్మిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Also Read: Pakistan| 15 రోజుల చంటి పాపను సజీవంగా పాతిపెట్టిన తండ్రి!.. ఎందుకంటే?

అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని పెరుగుతన్న ఒత్తిడిపై బైడెన్ స్పందన
ట్రంప్ తో జరిగిన డిబేట్ లో తను సరిగ్గా మాట్లాడలేకపోయానని బైడెన్ స్వయంగా అంగీకరిస్తూనే.. తాను ఎన్నికల నుంచి తొలిగే ప్రసక్తే లేదని.. కేవలం దేవుడు దిగి వచ్చి చెబితేనే అది జరుగుతుందని అన్నారు. బైడెన్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు మీడియా, ప్రజలలో రేటింగ్ విపరీతంగా తగ్గిపోయింది. ఆయన ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఎన్నికల్లో గెలవడం, నాలుగు సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించే సామర్థ్యం ఆయనకు ఉన్నదా? అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఉండాలనే భావనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ నాయకులే ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థ రాయ్ టర్స్ నివేదిక ప్రకారం.. బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తొలిగిపోతే.. సహజంగానే ఆయన స్థానంలో కమలా హారిస్ నిలబడే అవకాశాలున్నాయి.

Also Read: Myanmar Fake Job Alert| మయన్మార్‌లో నకిలీ ఉద్యోగాల రాకెట్.. భారత్ ఐటీ నిపుణులే టార్గెట్!

ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. బైడెన్ సహోద్యోగులతో డెమోక్రాట్స్ “లిజనింగ్ సెషన్” గా వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో బైడెన్ పనితీరును పరిశీలించి.. ఆయనను మద్దతు ఇవ్వకూడదని వారిని కోరినట్లు తెలిసింది. మరోవైపు.. ఆర్మడ్ సర్వీసెస్ కమిటీ లోని కాంగ్రెస్ మెన్, ర్యాంకింగ్ సభ్యడు స్మిత్ మాట్లాడుతూ.. ఇక బైడెన్ గద్దె దిగే సమయం వచ్చిందని అన్నారు.

ది వాషింగ్ టన్ పోస్టుల కథనం ప్రకారం.. లియు అనే మరో సెనేటర్ కూడా బైడెన్ ను తిరిగి అధ్యక్షునిగా నిలబెట్టడం సరికాదని అన్నారు. దీంతో బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

కానీ బైడెన్ మాత్రం ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో తన ప్రత్యర్థి ట్రంప్ పై గెలుపు సాధిస్తానని ప్రకటించారు.

 

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×