Big Stories

Babumohan, Manda out: కలిసిరాని కాలం, నామినేషన్ల తిరస్కరణ

Babumohan, Manda out: పైన కనిపిస్తున్న ఇద్దరు నేతలు రాజకీయాల్లో సీనియర్లు. ఒకరు మాజీమంత్రి బాబుమోహన్, మరొకరు మాజీ ఎంపీ మందా జగన్నాథం. ఒకప్పుడు రాజకీయాల్లో ఈ నేతలకు తిరుగులేదు. ప్రస్తుతం పార్టీలు మారినా కాలం మాత్రం వీరిద్దరికీ కలిసి రాలేదు.

- Advertisement -

తెలంగాణ పార్లమెంటు బరిలోకి దిగారు బాబుమోహన్, మందా జగన్నాథం. శుక్రవారంతో తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 17 సీట్లకు 893 మంది నామినేషన్లు వేశారు. అందులో 267 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అందులో మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రి బాబుమోహన్‌లకు అధికారులు షాకిచ్చారు. రీసెంట్‌గా ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.   ఈక్రమంలో ఆయన వరంగల్ ఎంపీ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే బాబుమోహన్‌ నామినేషన్‌లో ప్రతిపాదించిన వ్యక్తుల సంతకాలు లేకపోవడంతో తిరస్కరించారు ఎన్నికల అధికారులు.

- Advertisement -

మాజీ ఎంపీ మందా జగన్నాథం విషయానికొద్దాం. మూడుసార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. రెండుసార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. తెలంగాణలో మారిన రాజకీయాల నేపథ్యంలో కారు పార్టీలోకి వెళ్లారు. అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. పార్టీ తరపున బీఫామ్ ఇవ్వకపోవడంతో నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News