Yemen: యెమెన్ తీరంలో ప్రతికూల వాతావరణం కారణంగా సుమారు 150 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 68 మంది జలసమాధి అయ్యారు. మరో 74 మంది జాడ కనిపించలేదు. మృతులంతా ఆఫ్రికా ఖండానికి చెందినవారిగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది.
యెమెన్ తీరంలో ఆదివారం ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. మరో 74 మంది గల్లంతు అయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ వెల్లడించింది. జాతుల మధ్య సంఘర్షణ, అధిక పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికాలోని కొన్ని దేశాలు సంపన్నదేశాలు అరబ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో బోట్లపై ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
ఇథియోపియా నుంచి 154 మంది వలసదారులు పడవలో గల్ఫ్ దేశాలకు బయలుదేరారు. ప్రతికూల వాతావరణం కారణంగా దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్‌లోని అడెన్ తీరానికి సమీపంలో పడవ అదుపు తప్పింది. చివరకు సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో కేవలం 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఘటన సమయంలో తీరం వెంబడి గస్తీ కాస్తున్న అధికారులు వారిని రక్షించి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటల తర్వాత మృతదేహాలు తీరానికి కొట్టుకు వస్తున్నాయి. యెమెన్ తీరంలో జరిగిన వరుస ఓడ ప్రమాదాలలో ఈ విషాదం తాజాది.
ALSO READ: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం
154 మంది ఇథియోపియన్ వలసదారులతో ప్రయాణిస్తున్న ఈ నౌక ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్‌లోని అడెన్ గల్ఫ్‌లో మునిగిపోయిందని యెమెన్‌లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అధిపతి అబ్దుసట్టర్ ఎసోవ్ తెలిపారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా-ఎరిట్రియా లాంటి దేశాల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి.
ఓ వైపు కరవు, ఇంకోవైపు అంతర్యుద్ధం వంటి సమస్యలను చుట్టిముట్టాయి. వీటి నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశాలకు ఆయా దేశాల ప్రజలు వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో యెమెన్‌ని రవాణా మార్గంగా ఎంచుకుంటున్నారు. యెమెన్ మీదుగా ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా వలసదారులు వెనక్కి తగ్గలేదు.
ఐఓఎం నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రద్దీగా ఉండే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఘటన జరిగిన ప్రాంతం ఒకటి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 60 వేల మంది వలసదారులు యెమెన్‌కు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
యెమెన్ లో ఘోర ప్రమాదం.. 68 మంది మృతి
యెమెన్ తీరంలో మునిగిన ఇథియోపియన్ వలసదారుల ఓడ
ప్రమాద సమయంలో ఓడలో 154 మంది
74 మంది గల్లంతు
ఇప్పటి వరకూ 10 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్
కొనసాగుతున్న సహాయక చర్యలు pic.twitter.com/6kj4VaHjCt
— BIG TV Breaking News (@bigtvtelugu) August 4, 2025