BigTV English

Brahmamudi Serial Today August 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు ప్రెగ్నెన్సీ – పెళ్లికి నో చెప్పిన కళావతి

Brahmamudi Serial Today August 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు ప్రెగ్నెన్సీ – పెళ్లికి నో చెప్పిన కళావతి

Brahmamudi serial today Episode: ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటవ్‌ రావడంతో కావ్య ఏడుస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది. అప్పును హగ్‌ చేసుకుని ఇంకా ఎక్కువగా ఏడేస్తుంది. దీంతో అప్పు కంగారుగా ఏమైంది అక్కా అని అడుగుతుంది. టెస్ట్‌ కిట్‌ చూసి ఇదేంటి చేతిలో అంటూ చూసి నవ్వుతూ అక్కా ఇది నిజమా..? అని అడగ్గానే. అక్కా ఇది నిజమా..? అంటుంది. అవును అప్పు నేన తల్లిని కాబోతున్నాను అని చెప్పగానే.. ఏంటక్కా నువ్వు చెప్పేది అసలు నమ్మలేకపోతున్నాను అక్కా.. కంగ్రాట్స్‌ అక్కా.. కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది. బావ నువ్వు ఎప్పుడు కలిశారు అని అడుగుతుంది.


దీంతో కావ్య అదే అప్పు రెండు నెలల ముందు మేము శ్రీశైలం వెళ్లే ముందు ఒక బూత్‌ బంగ్లాలో అని చెప్పగానే.. అప్పు హ్యాపీగా ఇంత గుడ్‌ న్యూస్‌ చేతిలో పెట్టుకుని అంతలా కంగారు పడతావేంటి..? ఈ న్యూస్‌ ఇంట్లో అందరికీ చెప్పి సెలబ్రేట్‌ చేద్దాం పద అంటుంది. అప్పు ఇది సెలబ్రేట్‌ టైం కాదే అంటుంది కావ్య. సెలబ్రేట్‌ చేసుకునే టైం కాకపోవడం ఏంటి అక్కా.. ఒక ఆడపిల్లకు మొదటిసారి తల్లి కావడం అంటే మామూలు విషయమా చెప్పు అంటుంది అప్పు. కానీ ఈరోజు ఆయన నాకు ప్రపోజ్‌ చేయడానికి వస్తున్నారే..? అని చెప్పగానే.. అప్పు ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు కారులో వస్తున్న రాజ్‌ ఈ రోజు ఎలాగైనా సరే కళావతి గారికి నా మనసులో మాట చెప్పాల్సిందే.. అనుకుంటూ వస్తుంటాడు.

కావ్య ఏడుస్తూ అవతల ఆయన నాకు ప్రపోజ్‌ చేయడానికి హ్యాపీగా వస్తుంటారు. ఇవతల ఇలా నేను తల్లిని కాబోతున్న విషయం ఆయనకు తెలిస్తే దీనికి కారణం ఎవరు..? అని అడుగుతారు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అప్పు. దీనికి కారణం మీరే అని చెప్పాలా..? అసలు నేను చెప్పగలనా..? ఆయనకు నిజం తెలియాలంటే గతం గుర్తుకు రావాలి. గతం గుర్తు చేస్తే ప్రాబ్లమ్‌ అవుతుందని డాక్టర్‌ చెప్పారు అని బాధపడుతుంది. మరి ఇప్పుడు ఎలా అక్కా బావగారు ప్రపోజ్‌ చేశాక విషయం తెలిస్తే తను తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు మరి అని అడుగుతుంది అప్పు. అదే ఆలోచిస్తున్నాను అప్పు.. ఆయనను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అలాగని నిజం చెప్పే సాహసం చేయలేను. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అప్పు అంటూ ఏడుస్తుంది.


దీంతో అప్పు అక్కా బావగారు వచ్చే లోపు బాగా ఆలోచించి కరెక్టు డిసీజన్‌ తీసుకో అని చెప్తుంది. అప్పు దీని గురించి నేను ఆలోచిస్తాను కానీ ముందు నువ్వు రేవతి గారి అబ్బాయిని తీసుకుని వెళ్లు అప్పు ఈ విషయం ఎవరీకి చెప్పకు అనగానే.. సరే అక్కా అంటూ అప్పు వెళ్లిపోతుంది. కావ్య ఆలోచిస్తుంది. అప్పు, జూనియర్‌ స్వరాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. రాహుల్‌ అప్పును ఫాలో అవుతుంటాడు. రాహుల్‌ రావడం గమనించిన అప్పు.. కానిస్టేబుల్‌ శేషుకు ఫోన్‌ చేసి రాహుల్‌ ను అడ్డుకోమని చెప్తుంది. సరేనని వెళ్లి శేషు రాహుల్‌ కారును చెక్‌ చేస్తామని చెప్పి ఆపేస్తాడు.

మరోవైపు రాజ్‌ ఇంటికి రాగానే అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. నేను వచ్చేశా ఏంటి అందరూ నాకోసమే వెయిట్‌ చేస్తున్నారా..? అని అడుగుతాడు. ఇంకెంచెం లేటుగా వచ్చుంటు మీ అమ్మ చెంప చెల్లుమనిపించేది కూడా అంటుంది ఇంద్రాదేవి. దీంతో రాజ్‌ నవ్వుతూనే ఈ రోజు అన్నింటికీ తెరదించబోతున్నా. కథలో ఈ రాజకుమారుడు రాజకుమారిని సొంతం చేసుకోబోయే రోజులు రానే వచ్చేశాయి అంటాడు. ఇంతలో సుభాష్‌ ఇదేరా.. ఇదే కొంచెం అంటూ చెప్పబోతుంటే తగ్గించుకుంటే మంచిది అంటారు కదా..? తగ్గించుకుంటాను.. అవును ఇంతకీ కళావతి గారు ఎక్కడ..? అని అడుగుతాడు.

దీంతో ధాన్యలక్ష్మీ నువ్వు వస్తావని సిగ్గుతో లోపల దాక్కున్నట్టు ఉంది రామ్‌. ఎన్నిసార్లు పిలిచినా బయటకు రావడం లేదు.. అంటుంది. ఇక ఇంద్రాదేవి కూడా అంతేనా ఇందాకటి నుంచి అద్దం ముందు తెగ రెడీ అయిపోయింది. నువ్వు వస్తున్నావని ఏమో తెగ మురిసిపోయింది అంటుంది. మీరు అలా చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది.. అంటూ రుద్రాణిని చూస్తూ అందరూ హ్యాపీగా ఉంటే మీరేంటి మాడిపోయిన మసాలా దోశలా అలా ఉన్నారు అని అడుగుతాడు. అది మాన్యుఫాశ్చరింగ్‌ డిఫెక్ట్‌ లే రామ్‌ అంటాడు ప్రకాష్‌. దీంతో రుద్రాణి కోపంగా అవును అవును నేను నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది. అయినా నా గురించి ఎందుకులే నువ్వేదో ఇపార్టెంట్‌ పని మీద వచ్చినట్టు ఉన్నావు కదా ముందు అది కానివ్వు అని చెప్తుంది. దీంతో రాజ్‌ అవును కదా..? కళావతి గారు త్వరగా రండి మీ కోసం వెయిటింగ్‌ అంటూ పిలుస్తాడు.

రూంలోంచి కావ్య ఏడుస్తూ మెల్లగా కిందకు వస్తుంది. కావ్య రాగానే కళావతి గారు ఇక ఆగడం నా వల్ల కాదండి నా మనసులో మాటను మనసులోనే దాచుకుని ఇన్ని రోజులు ఫ్రెండ్లీగా ఉంటున్నాను. కానీ ఇవాళ నా మనసులో మాట చెప్పేస్తాను అనగానే.. కావ్య రామ్‌ గారు ముందు ఒకసారి నేను అంటూ ఏదో చెప్పబోతుంటే.. రాజ్‌ అడ్డుపడి ఫ్లీజ్‌ కళావతి గారు ఈరోజు ఇక్కడ నేను మాత్రమే మాట్లాడతాను. మీరు విని మీ డిసీజన్‌ చెప్తే చాలు.. అసలు రాత్రంతా నేను ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి అని ఎంత ప్రాక్టీస్‌ చేశానో తెలుసా..? అసలు ఈ మనసులో ఏముందో నాకు తెలుసు..? కానీ ఇప్పుడు ఇక్కడ అందరి ముందు ఓపెన్‌ అయితే బాగుంటుంది. మీతో కలిసి ఏడడుగులు నడవాలి అనుకుంటున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా..? అని రాజ్‌ అడగ్గానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి ఇరిటేటింగ్‌గా చూస్తుంది.

కావ్య ఏడుస్తుంది. రాజ్‌ ఏంటండి ఆ కన్నీళ్లు అని అడగ్గానే అవి కన్నీళ్లు కావని ఆనందబాష్పాలు అని చెప్తుంది ఇంద్రాదేవి. కావ్య సైలెంట్‌గా ఉంటుంది. అందరూ పెళ్లి గురించి.. మాట్లాడుకుంటారు. దీంతో కావ్య కోపంగా ఇక చాలు ఆపుతారా..? ఇందాకటి నుంచి చూస్తున్నాను అయన మనసులో మాట చెప్పగానే అందరూ  పెళ్లి ఎలా చేయాలా అనే వరకు వెళ్లిపోయారు.  నన్ను అడగరా..? నా నిర్ణయంతో మీకు పని లేదా..? ఆయన ఇష్టం అని నేను మీకు చెప్పానా… అసలు నేను పెళ్లికి ఒప్పుకున్నానా…? అంటుంది. అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ ఏంటో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది. దీంతో కావ్య నిజమే అత్తయ్యా ఆయన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. రుద్రాణి షాకింగ్‌గా చూస్తూ ఇదేం ట్విస్టురా నాయనా ఇది నేను గెస్‌ చేయలేదు అనుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Star Maa Parivaaram Promo: శ్రీముఖికి దిమ్మతిరిగే కౌంటర్.. పెళ్లి కావ్య షాకింగ్ రియాక్షన్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంటికి దొంగగా వచ్చిన ఆనందారావు.. ధీరజ్ కు దొరికిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవనిని గేంటేసిన పార్వతి.. భరత్, ప్రణతిలను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్.. భానుమతికి వాతలు..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. పూజను పూర్తి చేసిన రోహిణి.. బాలు సెటైర్లు.. మనోజ్ కు కడుపు మంట..

Nindu Noorella Saavasam Serial Today August 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలాను అడ్డుకునేందుకు ఆరు ప్లాన్‌

Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన కావ్య – ఎమోషనల్‌ అయిన ఇంద్రాదేవి  

Big Stories

×