Kazakhstan Plane Crash| కజకిస్తాన్ దేశంలోని అక్టావు నగరం వద్ద ఒక భారీ విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 70 మంది మరణించారని కజకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అజర్ బైజాన్ దేశ రాజధాని బకు నుంచి రష్యా లోని గ్రోజ్నీ నగరాన్ని బయలుదేరిన అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం కజకిస్తాన్ లో కూలిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక విమానం వేగంగా ఆకాశంలో నుంచి కిందవైపు పడిపోతూ ఉండడం కనిపిస్తోంది. చివరి ఒక చోట విమానం కింద పడి పేలుడు సంభవించిన దృశ్యాలున్నాయి. విమానం కూలిపోయిన సమయంలో అందులో 100 మందికి పైగా ఉన్నారని సమాచారం. అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంబ్రేయర్ 190 విమానం కూలిపోయిన తరువాత అత్యవసర సహాయక చర్యలు చేపట్టామని.. విమాన ప్రయాణికుల్లో 25 మంది తీవ్ర గాయాల్లో ఉన్నారని కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రష్యా, చెచన్యా లో ఉన్న గ్రోజ్నీ నగరానికి బయలు దేరిన ఈ విమానం గ్రోజ్నీలో మంచు కురుస్తూ.. విజువల్స్ సరిగా లేకపోవడంతో కజకిస్తాన్ మీదుగా దాడి మళ్లించడం జరిగిందని అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ తెలిపింది. అయితే కజకిస్తాన్ అక్టావు నగరం విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లో నుంచి ఎయిర్ పోర్ట్ లో వేగంగా ల్యాండింగ్ కావడంతో విమానం గింగిరాలు తిరుగుతూ ల్యాండ అయి పేలిపోయిందని అధికారులు తెలిపారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
అయితే ఈ ప్రమాదానికి కారణం పక్షులు అని తెలిసింది. విమానం కూలిపోయే ముందు విమాన పైలట్లు ఒక ప్రమాద సిగ్నల్ చ్చారు. అందులో ఒక పక్షుల మంద వంది విమానంతో ఢీకొన్నదని.. అందువల్ల విమాన స్టీరింగ్ పనిచేయడం లేదని తెలియజేశారు. చివరి నిమిషంలో కంట్రోల్స్ ఫెయిల్ కావడంతో పైలట్లు విమానం స్పీడు తగ్గించలేకపోయారని.. రష్యా మీడియా స్పుత్నిక్ తెలిపింది.
మరో వీడియోలో విమానం కూలిపోయేముందు పైలట్లు దాన్ని మళ్లీ గాల్లోకి లేపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం.. ఫ్లైట్ నెంబర్ జె2-8243, రిజిస్ట్రేషన్ నెంబర్ 4K-AZ65 అక్టావు నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఈ ఘటన స్థానిక సమయం ఉదయం 6:28 గంటలకు జరిగింది.
BREAKING: Azerbaijan Airlines flight traveling from Baku to Grozny crashes in Aktau, Kazakhstan, after reportedly requesting an emergency landing pic.twitter.com/hB5toqEFe2
— RT (@RT_com) December 25, 2024