BigTV English

Coconut Oil For Skin: కొబ్బరినూనె శరీరానికి రాసుకుంటే ఊహించని అందం మీ సొంతం..

Coconut Oil For Skin: కొబ్బరినూనె శరీరానికి రాసుకుంటే ఊహించని అందం మీ సొంతం..

Coconut Oil For Skin: చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి తరచూ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటాం. కానీ ఇవి కేవలం అప్పటి వరకు మాత్రమే చర్మ సౌందర్యాన్ని ఇస్తుంటాయి. అయితే ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ వాడడం వల్ల నిత్యం చర్మ కాంతిని కాపాడుకున్నా కూడా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, లేదా త్వరగా చర్మంపై ముడతలు రావడం, త్వరగా ముసలితనం రావడం వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నూనెను వాడడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనెను జుట్టుకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. జుట్టు మృదువుగా, చుండ్రు వంటి సమస్యలు దూరం కావడానికి, జుట్టు బలంగా తయారుకావడానికి తోడ్పడుతుందని అందరికీ తెలిసిందే. కానీ కొబ్బరినూనె చర్మం మరియు శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా తోడ్పడుతుంది. కొబ్బరినూనెను తరచూ శరీరానికి రాసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


* చర్మ సంరక్షణ :

కొబ్బరినూనెను చర్మసంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు మొటిమలను తగ్గించేలా చేస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే క్యాప్రిక్ యాసిడ్స్, లారిక్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది శరీరంలోని కొల్లాజెన్, యాంటీ ఆక్సిడెంట్లు పెంచే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అంతేకాదు చర్మ మంటను కూడా తొలగించేలా చేస్తుంది.


* బరువు తగ్గడం :

తరచూ ఆహారం తీసుకునే దానిలో కొబ్బరినూనెను తీసుకోవడం మంచిది. కొబ్బరి నూనెతో తయారుచేసిన వంటలను తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.

* జుట్టు రక్షణ :

జుట్టుకు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ధృడంగా, మృదువుగా తయారవుతుంది. మరోవైపు ఉదయాన్నే కొబ్బరినూనెను కండీషనర్ గా కూడా ఉపయోగించవచ్చు.

* స్ప్లిట్ హెయిర్ :

జుట్టు సమస్యల్లో ప్రధానంగా చివర్లు చిట్లిపోవడం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అందువల్ల కొబ్బరి నూనెను జుట్టు చివర్లకు రాసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల చిట్లీపోవడం వంటి సమస్యను తగ్గించుకోవచ్చు.

* బాడీ మసాజ్:

కొబ్బరినూనె కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాకుండా బాడీ మసాజ్ కు కూడా పనిచేస్తుంది. శరీరానికి కొబ్బరినూనెను మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

* లిప్ బామ్:

తరచూ రాత్రివేళ నిద్రపోయే ముందు కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల పెదవుల పగుళ్ల నుంచి తప్పించుకోంవచ్చు.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×