BigTV English

Argentina: హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా.. కారణమిదే !

Argentina: హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా.. కారణమిదే !

Argentina: హమాస్‌ను అర్జెంటీనా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. అమెరికా, ఇజ్రాయిల్‌తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసేదిశగా ఆలోచిస్తున్నట్లు అర్జెంటీనా అధ్యక్షుడు జేవిలియర్ మెయిలీ  తెలిపారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన చేశారు.


గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది. 76 ఏళ్ల ఇజ్రాయిల్ చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుంది. అర్జెంటీనా వేశంలో యూదులు ఉంటున్న ప్రాంతంపై హమాస్ ఉగ్రదాడి చేసిందని ఈ సంస్థలకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అర్జెంటీనా ఆరోపించింది. ఇదిలా ఉంటే.. ఇజ్రాయిల్ తరుచూ హమాస్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.గాజాలో జరిగిన ఈ దాడుల్లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు.

Also Read: ట్రంప్‌కి శుభవార్త చెప్పిన మెటా..


హమాస్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయిల్, అర్జెంటీనా ప్రజలనుఊచకోత కోస్తోందని ఆరోపించారు. తూర్పు గాజా నగరంలోని వేలాది మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దళాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తరిమికొట్టాయని, అయితే వారు అక్కడికి రాగానే వారిపై కాల్పులు జరపాలని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ తెలిపారు. గాజా సిటీని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని పాలస్తీనియన్లు ఇటీవల ఇజ్రాయిల్ ఆర్మీ ఆదేశించింది. ఇజ్రాయిల్ దళాలు గాజా నగరంలోని హెచ్చరికల కరపత్రాలను జారవిడిచాయి. అక్కడి ప్రజలు అందరూ దక్షిణం వైపు వెళ్లాలని దానిలో కోరారు.

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×