ACB Raids: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వరరావు నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆయనకు సంబంధించిన అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. ఏసీబీ అధికారులు బండి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 5.02 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే వీటి మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.
ధరణిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల ఆస్తులు
సోదాల్లో 1.15 కోట్ల రూపాయల విలువైన ఇల్లు, 1.43 కోట్ల రూపాయలు విలువ చేసే 17.10 ఎకరాల వ్యవసాయ భూమి, 70 తులాల బంగారం గుర్తించారు. వీటితో పాటుగా 92,000 రూపాయలు విలవైన వెండి ఆభరణాలు, 3.28 లక్షల విలువైన 23 రిస్ట్ వాచీలును స్వాధీనం చేసుకున్నారు.
ఏకకాలంలో వరంగల్, హనుమకొండ, ఖమ్మంలో సోదాలు
హనుమకొండ జిల్లాలోని ఖాజీపేట చైతన్యపురిలో బండి నాగేశ్వరరావు నివాసంతో పాటు, ఆయన సొంత జిల్లా ఖమ్మంలోని ఇతర ప్రదేశాల్లో కూడా సోదాలు చేశారు. నాగేశ్వరరావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు.
Also Read: నాగబాబుపై జనసైనికుల తిరుగుబాటు.. పవన్ ప్లాన్ ఏంటి?
పనిచేసిన సమయంలో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు
అయితే బండి నాగేశ్వరరావు తన సర్వీసు కాలంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఈ ఆస్తులను సమకూర్చుకున్నట్లు ఏసీబీ ఆరోపించింది.ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి, వరంగల్‌లోని ఏసీబీ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోంది, మరియు అదనపు ఆస్తుల గురించి ధృవీకరణ కొనసాగుతోంది.
తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. రూ. 5 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు!
వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై హన్మకొండ చైతన్యపురిలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ… pic.twitter.com/sfHcadLRuO
— BIG TV Breaking News (@bigtvtelugu) August 29, 2025