BigTV English

Indigo: ఫ్లైట్‌లో కామాంధుడు.. ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు..

Indigo: ఫ్లైట్‌లో కామాంధుడు.. ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు..

Indigo: విమానాల్లో కేటుగాళ్లు ఎక్కువైపోతున్నారు. వికృతచేష్టలతో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జన చేశాడు. రెండు రోజుల క్రితం మరో విమానంలో ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకోవడంతో పాటు డోర్ దగ్గర మలమూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనలు మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది.


బ్యాంకాక్ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి ఎయిర్‌హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫుడ్‌ బిల్ కోసం ఎయిర్‌హోస్టెస్ పీఓఎస్ మెషిన్ తీసుకొని ప్రయాణికుడి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెను ప్రయాణికుడు ప్రైవేట్ భాగాల్లో తాకాడు. అంతటితో ఆగకుండా అందరి ముందే ఆమెను వేధించాడు.

ఎయిర్‌హోస్టెస్ పైలెట్‌కు జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులకు పైలెట్ కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు స్వీడన్‌కు చెందిన 62 ఏళ్ల క్లాస్ ఎరిక్ ఎరాల్డ్ జొనాస్ వెస్ట్‌బర్గ్‌గా గుర్తించారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×