Big Stories

KVP: జగన్‌తో దూరం ఎందుకంటే.. కేవీపీ క్లారిటీ!

kvp jagan

KVP: కేవీపీ. ఇప్పటి జనరేషన్‌కు ఈయన పెద్దగా తెలీకపోవచ్చు గానీ.. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగువెలిగారు. తెరమీదికంటే.. తెరవెనుక రాజకీయాలకే పరిమితమయ్యేవారు. రాజశేఖర్‌రెడ్డికి మంచి స్నేహితుడిగా, నమ్మిన వ్యక్తిగా మెదిలారు. కేవీపీ తన ఆత్మ అంటూ వైఎస్సారే ఓ సందర్భంలో చెప్పారంటే వారిద్దరూ ఎంత క్లోజో తెలుస్తుంది.

- Advertisement -

వైఎస్సార్‌కు నిత్యం వెన్నంటే ఉంటూ.. ప్రభుత్వంలో, కాంగ్రెస్‌లో కేవీపీ చక్రం తిప్పేవారని అంటారు. ఆయన్ని సంప్రదించకుండా వైఎస్ అసలేపనీ చేయరని చెప్పేవారు. అలాంటి కేవీపీ.. వైఎస్సార్ మరణం తర్వాత ఆ కుటుంబానికి దూరమయ్యారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోసం ట్రై చేస్తే కేవీపీ నుంచి మద్దతు లభించలేదు. తండ్రి పేరుతో జగన్ పార్టీ పెట్టినా.. ఆయన మాత్రం తన స్నేహితుడి కొడుక్కి మద్దతుగా నిలవలేదు. కాంగ్రెస్ పార్టీ జగన్‌ను టార్గెట్ చేసినా.. జగన్‌కు కేసులు చుట్టుకున్నా.. జైలు కెళ్లినా.. ఉలుకుపలుకు లేకుండా ఉన్నారు. తాను నమ్మిన కాంగ్రెస్‌కే కట్టుబడి ఉన్నారు.. ఇప్పటికీ ఉన్నారు.

- Advertisement -

వైఎస్సార్‌కి అంత సన్నిహితుడైన కేవీపీ.. ఆయన కుటుంబానికి ఎందుకు దూరమయ్యారనేది ఇప్పటికీ ఆసక్తికర విషయమే. జగన్‌కు అన్నీతానై కేవీపీ చక్రం తిప్పుతారని అనుకున్నారంతా. కానీ, వారిద్దరి మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. ఓ దశలో అప్పటి వైసీపీ నాయకురాలు కొండా సురేఖతో.. కేవీపీపై అవినీతి ఆరోపణలు కూడా చేయించారు జగన్. దాంతో వారి బంధం మరింత బీటలు వారింది. ఆ తర్వాత నుంచి వారిమధ్య పెద్దగా పలకరింపులు కానీ, సంప్రదింపులు కానీ జరగలేదు.

తాజాగా, జగన్‌కు తనకు మధ్య వచ్చిన దూరంపై కేవీపీ రామచంద్రరావు స్పందించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి దగ్గరగా ఉన్న తాను.. జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే ప్రశ్నల నుంచి ఇక ఎంతో కాలం దూరం జరగలేనని అన్నారు. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఒకరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి అన్నీ వివరిస్తానని చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం తానా విషయాన్ని వెల్లడించలేనని చెప్పుకొచ్చారు కేవీపీ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News