EPAPER

Amazon: కోతలు మొదలెట్టిన అమెజాన్

Amazon: కోతలు మొదలెట్టిన అమెజాన్

ప్రపంచంలోనే అతిపెద్ద నదుల్లో ఒకదాని పేరు పెట్టుకున్న అమెజాన్ సంస్థ… దానికి తగ్గట్టే… కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఒక్కో విభాగం నుంచి ఉద్యోగుల్ని తీసేయడం మొదలుపెట్టింది… అమెజాన్. తీసుకున్నది బాధాకర నిర్ణయమని… అయినా చేయకతప్పడం లేదని అమెజాన్ ప్రకటించింది.


ట్విట్టర్, మెటా సంస్థలు ఇటీవల ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. మస్క్ 8 వేల సిబ్బందిని, జుకర్ బర్గ్ 13 వేల ఉద్యోగులను ఇంటికి సాగనంపాడు. ఆ వెంటనే అమెజాన్ కూడా 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నామని ప్రకటించి… అందరికీ షాకిచ్చింది. దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టడంతో… ఇది ఇంకా ఏ స్థాయికి దారి తీస్తుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు.

ఇకపై సంస్థలో కొన్నిరకాల ఉద్యోగాలు అవసరం లేదని సిబ్బందికి రాసిన లేఖలో హార్డ్‌వేర్‌ చీఫ్‌ డేవ్‌ లింప్‌ పేర్కొన్నాడు. ఇది కఠిన నిర్ణయమైనా తప్పడం లేదని… ఉద్యోగాలు కోల్పోయేవారికి కొత్త జాబ్ దొరికేలా సహాయ సహకారాలు అందిస్తామని లింప్‌ పేర్కొన్నాడు. అయితే, ఎంతమందిని తొలగించబోతున్నదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అనేక రివ్యూల తర్వాత కొన్ని విభాగాలు, ప్రాజెక్టులను స్థిరీకరించాలని నిర్ణయించామని… కొన్ని రకాల ఉద్యోగాలు సంస్థకు ఎప్పటికీ అవసరం లేదని గుర్తించామని లింప్ చెప్పాడు. ఇది చెప్పడానికి చాలా బాధగా ఉందని… ఈ నిర్ణయం కారణంగా ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని కోల్పోవాల్సివస్తోందని అని లింప్‌ తన లేఖలో పేర్కొన్నారు.


అమెజాన్ లో డివైజెస్‌, రిటైల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగాల్లో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయా విభాగాల మేనేజర్లు ఇప్పటికే సిబ్బందికి తెలియజేశారని… రెండు నెలల్లోగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారని చెబుతున్నారు. ఆదాయం పడిపోవడం, కంపెనీ షేరు విలువ తగ్గడంతో ఉద్యోగాల కోత మొదలుపెట్టిన అమెజాన్… ఎంత మందిని తొలగిస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Related News

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×