America: అమెరికాలోని వలసవాదులను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు కఠినమైన చట్టాలు తెస్తూనే మరోవైపు వీసా రుసుములను అమాంతంగా పెంచేసింది. ఫలితంగా ఖజానాను నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా గ్రీన్ కార్డులు పొందాలను భారతీయులకు షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. వాటి ఫీజులను భారీగా పెంచేసింది. దీంతో భారతీయులకు ఆ విషయం మింగుడుపడడం లేదు.
అమెరికాలో పెట్టుబడులు పెట్టి అక్కడే శాశ్వత నివాసం పొందాలనుకునే విదేశీయులకు ఝలక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. ఈ నిర్ణయం భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. భారతీయ వ్యాపారవేత్తలు, కుటుంబాలు ఎక్కువగా ఆసక్తి చూపే ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ఫీజులను భారీగా పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఫీజుల నిబంధనను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఖరారు చేసింది. కొత్త ఫీజులు నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపు వల్ల అక్కడ పెట్టుబడి పెట్టి యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసం కోరుకునే భారతీయ పారిశ్రామికవేత్తల ఖర్చు పెంచుతుందని అంచనా.
రీజనల్ సెంటర్ల ద్వారా పెట్టుబడి పెట్టేవారు ఫారం I-526E ఫీజు 3675 డాలర్లు చెల్లించేవారు. ఇకపై 7850 డాలర్లకు చెల్లించాల్సి వుటుంది. దీనికితోడు రెండు ఫారాలకు అదనంగా 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు చెల్లించాలి. గ్రీన్ కార్డ్‌పై ఉన్న షరతులను తొలగించుకోవడానికి దాఖలు చేసే ఫారం I-829 ఫీజు 3750 డాలర్లు ఉండేది. ఇప్పుడు అది కాస్త 5000 డాలర్లకు చేరింది.
రీజనల్ సెంటర్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫారం I-956 ఫీజు 17795 డాలర్లు గతంలో చెల్లించేవారు. ఇకపై 44,115 డాలర్లకు చేరింది. అదే సమయంలో పెట్టుబడి ప్రాజెక్టు ఆమోదం కోసం ఉపయోగించే ఫారం I-956F ఫీజు 17795 డాలర్ల నుంచి 42,675 డాలర్లకు అమాంతంగా పెంచేసింది. ఫారం I-956G వార్షిక ఫీజును 3,035 డాలర్ల నుంచి 2,165 డాలర్లకు కుదించింది. USCIS ప్రకారం.. ఈ ఏజెన్సీ తన కార్యకలాపాలకు అవసరమైన నిధులను దరఖాస్తు రుసుముల ద్వారా సమకూర్చుకుంటుంది. ఈ కార్యకలాపాలలో దరఖాస్తులను ప్రాసెస్ చేయడం, తనిఖీలు నిర్వహించడం, అర్హతను ధృవీకరించడం, మోసాన్ని నివారించడం వంటివి ఉంటాయి.
అమెరికాలో పెట్టుబడులు పెడుతూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 1990లో అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈబీ-5 ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. దీని కింద విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలో వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేస్తూ కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనేది కాన్సెప్ట్. దీనిద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు అర్హత సాధించవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పెట్టుబడికి మొత్తం అర్హత కలిగిన బిజినెస్‌లో 1.05 మిలియన్ డాలర్లు. ఉపాధి ప్రాంతం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు కనీస పెట్టుబడి 8 లక్షల డాలర్లుగా ఉంది. ఈ నిబంధనలు పాటించిన వ్యాపారవేత్తల జీవిత భాగస్వామి, అర్హతగల పిల్లలు గ్రీన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ALSO READ: రష్యాలో కుప్పకూలిన బాంబర్ విమానం.. ఆరుగురు సైనికులు దుర్మరణం
కొన్నేళ్లుగా భారత్ నుండి EB-5 కార్యక్రమానికి వివరీతమైన డిమాండ్ పెరిగింది. ఫలితంగా భారతీయ దరఖాస్తులు అక్కడ కుప్పలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్నవారికి ఆ ఫీజులు ప్రభావితం చేయనుంది. దరఖాస్తు రుసుములు విపరీతంగా పెరగడంతో భారతీయ వ్యాపారులకు ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రుసుముల పెంపు ప్రాథమిక పెట్టుబడి అర్హత లేకుంటే ఉద్యోగ కల్పన అవసరాలను మార్చదని ప్రత్యేక నిబంధనల ద్వారానే కొనసాగుతాయి.