BigTV English

Meta Offer: ఏంటి బాసూ.. రూ.13000 కోట్ల జాబ్ ఆఫర్ ని ఎవరైనా వదులుకుంటారా? మెటాకే షాక్ ఇచ్చాడుగా!

Meta Offer: ఏంటి బాసూ.. రూ.13000 కోట్ల జాబ్ ఆఫర్ ని ఎవరైనా వదులుకుంటారా? మెటాకే షాక్ ఇచ్చాడుగా!

ఉద్యోగం మారడానికి జీతమే ప్రధాన కారణం అని చాలామంది అభిప్రాయం. సహజంగా ఎక్కువ జీతం ఇచ్చే యాజమాన్యాల వద్దకే ఉద్యోగులు వెళ్తుంటారనే అంచనాలు కూడా ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో కూడా మేథో వలస సర్వ సాధారణం. మెరికల్లాంటి ఉద్యోగులకోసం బడా కంపెనీలు ఎప్పుడూ వెదుకుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద ప్యాకేజీలు ఆఫర్ చేసి వారిని తమవైపు తిప్పుకుంటాయి. అయితే ఇది నూటికి నూరుపాళ్లు నిజం కాదు. ఇదే నిజమైతే సూపర్ టాలెంట్ ఉన్న ఉద్యోగులంతా గూగుల్, మెటా లాంటి కంపెనీల్లోనే పనిచేయాలి. స్టార్టప్ లలో వారి జాడే ఉండకూడదు. ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, తమ ఉనికిని నిరూపించుకోవడం అని అనుకునే బ్యాచ్ కూడా ఉంది. లైఫ్ లో సూపర్ సక్సె అయ్యేవారు వీరు మాత్రమే. ఇలాంటి వారు ఏ ప్రలోభాలకు లొంగరు, ఏ ప్యాకేజీలకు కరిగిపోరు, ఏ బిగ్ బాస్ ఫోన్ చేసినా బెదిరిపోరు. అలాంటి ఓ సూపర్ ఎంప్లాయ్ ఆండ్రూ తుల్లోచ్. తాజాగా ఇతనికి మెటా కంపెనీ భారీ ఆఫర్ ఇచ్చింది. ఆరేళ్ల కాలానికి బాండ్ రాసిస్తే 13వేల కోట్ల రూపాయలు అతనికి ముట్టజెబుతామని కబురందించింది. అంటే నెలకు దాదాపుగా 100కోట్లపైమాటే. అంతటి ఆఫర్ ని ఎవరు వదులుకుంటారు. కానీ తుల్లోచ్ ఆ ఆఫర్ ని ఎడం చేత్తో విసిరి పక్కనపెట్టేశాడు. దీంతో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కి తలకొట్టేసినట్టయింది.


అంతా ఏఐ మాయాజాలం..
మిగతా రంగాలతో పోల్చి చూస్తే సాప్ట్ వేర్ ఇంజినీర్ల జీతాలు బాగా ఎక్కువ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆ రంగంలో నాలెడ్జ్ ఉన్నవారికి మరింతగా మహర్దశ పట్టింది. అయితే నిపుణుల సంఖ్య తక్కువ, వారితో అవసరం ఎక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో ఆ కంపెనీ, ఈ కంపెనీ అటు, ఇటు అంటూ ఉన్నవారే చక్కర్లు కొడుతున్నారు. ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే అక్కడకు పరుగులు తీస్తున్నారు. ఇలా చాలామంది టాలెంటెడ్ ఎంప్లాయిస్ ని మెటా, గూగుల్ తమవైపు తిప్పుకుంది. అంతేకాదు, స్టార్టప్ కంపెనీలను సైతం కొనేస్తూ ప్రత్యర్థులు లేకుండా చూసుకుంటున్నాయి పెద్ద కంపెనీలు. AI స్టార్టప్ థింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌ ని విలీనం చేసుకోవాలని చూశారు మెటా బాస్ జుకర్ బర్గ్. ఆ కంపెనీ కో ఫౌండర్ మీరా మురాటికి భారీ ఆఫర్ ఇచ్చారు. ఆమె కాదు పొమ్మన్నది. దీంతో జుకర్ బర్గ్ మరో ఎత్తు వేశారు, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్ని తనవైపు తిప్పుకోవాలని చూశాడు. థింకింగ్ మెషీన్స్ లో కీలక ఉద్యోగి ఆండ్రూ తుల్లోచ్ ఆరేళ్లకు కి 1.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ఎరవేశాడు. కానీ ఆ అస్త్రం తుస్సుమంది. తుల్లోచ్ ఆ ఆఫర్ ని నిర్ద్వందంగా తోసి పుచ్చాడు. తనకు జీతం మాత్రమే ముఖ్యం కాదని, చేసే పనిలో సంతృప్తి ఉండాలన్నాడు. తాను థింకింగ్ మెషిన్స్ లోనే ఉంటానన్నాడు.

ఆఫర్ తిరస్కరించిన 50మంది..


సాఫ్ట్ వేర్ రంగంలో ఇలాంటి భారీ ఆఫర్లు సర్వ సాధారణం, వాటికి ఉద్యోగులు ఆకర్షితులవడం కూడా సహజమే. కానీ తుల్లోచ్ లాంటి వారు అరుదుగా ఉంటారు. ఇంకో విశేషం ఏంటంటే.. గతంలో అతను మెటాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు. అప్పుడు అలాంటి ఉద్యోగిని మెటా వదులుకోవాల్సి వచ్చింది, ఇప్పుడతను తిరిగి రానంటుండే సరికి జుకర్ బర్గ్ ఫీలయ్యాడు. మురాటి టీమ్ లోని 50 మంది ఉద్యోగులు కూడా మెటా ఆఫర్ ని తిరస్కరించారు. మెటా ఇచ్చే డబ్బు సంచులు, తమ విధేయతను కొనుగోలు చేయలేవని వారు అంటున్నారు.

డబ్బు సంచులకు లొంగని ఉద్యోగులు

ఆమధ్య ఓపెన్ ఏఐని కూడా జుకర్ బర్గ్ టార్గెట్ చేశారు. ఆ కంపెనీలోని దాదాపు 100మంది టాలెంటెడ్ ఉద్యోగుల్ని మెటాలోకి తీసుకోవాలనుకున్నాడు. కానీ కేవలం 10మంది మాత్రమే జుకర్ బర్గ్ ఆఫర్ ని ఒప్పుకుని గోడదూకారు. ఓపెన్ ఏఐలో పనిచేసిన ఉద్యోగులు కొందరు ఇప్పుడు మురాటి సారథ్యంలో థింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌ లో పనిచేస్తున్నారు. వీరి ఏపై స్టార్టప్ సూపర్ సక్సెస్ అనే పేరు తెచ్చుకుంది. ఫండింగ్ కూడా బాగానే ఉంది. అందుకే మెటా తొందరపడుతోంది. వీలైతే విలీనం, లేకపోతే ఉద్యోగులకు ఎర అనే ప్రయత్నాలు చేశారు జుకర్ బర్గ్. కానీ తుల్లోచ్ లాంటి ఉద్యోగులు జుకర్ డబ్బు సంచులకు లొంగకపోవడం ఇక్కడ విశేషం.

Related News

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Anti-immigrant Sentiment: లండన్ నిరసనలు.. ఎవరికి పాఠం, ఎవరికి గుణపాఠం?

Big Stories

×