BigTV English

Animals : నిద్ర అక్కర్లేని ప్రాణులు

Animals : నిద్ర అక్కర్లేని ప్రాణులు
Animals

Animals : ప్రాణులకు గాలి పీల్చడం ఎంత ముఖ్యమో.. నిద్రించడం కూడా అంతే అవసరం. జీవగడియారం సరిగ్గా పనిచేయాలంటే నిద్రపోక తప్పదు. నిద్రించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మనమైతే రోజుకు కనీసం 7-8 గంటలైనా నిద్రపోవాల్సిందే. నిద్ర లేకుండా 11 రోజులు మాత్రమే బతకగలుతామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.


మరి నిద్ర అన్నదే అవసరం లేని ప్రాణులు ఏవో తెలుసా? బుల్‌ఫ్రాగ్స్ నెలల తరబడి నిద్రించవు. సుదీర్ఘకాలం కునుకు అన్నదే తీయకుండా ఈ ఉభయచర జీవులు ఎంచక్కా బతికేస్తాయి. గ్రేట్ వైట్ షార్క్ చేపల వంటివి అసలు నిద్రించనే నిద్రించవు. ఆక్సిజన్‌ను పీల్చుకునేందుకు ఇవి ఈదుతూనే ఉంటాయి. ఈ నిరంతర ప్రక్రియ కారణంగా వాటికి విశ్రాంతి అన్నదే తెలియదు.

ఏనుగులు కూడా రోజుల తరబడి నిద్ర లేకుండా బతకగలవు. స్వల్ప సమయం పాటు విశ్రాంతి తీసుకునే ప్రాణుల్లో ఏనుగు ఒకటి. అవి నేలపైకి ఒరిగి నిద్రపోయేది కొన్ని గంటల పాటే. ఇక గబ్బిలాల నిద్ర వేళలు అసాధారణ రీతిలో ఉంటాయి. రోజుకు 20 గంటలు నిద్రిస్తాయి. అయితే ఆ నిద్ర అనేది ఏకబిగిన సాగదు. మధ్యమధ్యలో అవి మేల్కొంటుంటాయి.


జిరాఫీలు రోజుకు 4 గంటలు మాత్రమే పవళిస్తాయి. అదీ మధ్యమధ్యలో విరామాలు ఇస్తూ. అవి నేలపై నిద్రించినా.. ఒక్కోసారి నిలబడి కూడా కునుకు తీసేస్తాయి. గుర్రాలు కూడా అంతే. నేలపై పడుకుంటాయి. అలాగే నిలుచుని కూడా నిద్రపోగలవు.

ఆల్‌బెట్రోసెస్ సముద్రపక్షులు ఎగురుతూనే స్లీప్‌మోడ్‌లోకి జారిపోగలవు. మెదడులో సగ భాగం విశ్రాంతి తీసుకుంటుంటే.. పరిసరాలపై అప్రమత్తంగా ఉండటం, ఫ్లయిట్‌ను నియంత్రించడం వంటి పనుల్లో మిగిలిన సగభాగం నిమగ్నమై ఉండటం ఈ సీబర్డ్స్ ప్రత్యేకం.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×