Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా మరో కీలక ముందడుగుగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీలు వైట్‌హౌస్‌లో ఆగస్టు 18, 2025న ఒక ముఖ్యమైన భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్ నాయకులు నాటో ప్రతినిధులు కూడా పాల్గొన్నారు, ఇది యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు ఒక అసాధారణ సంఘటనగా నిలిచింది. ఈ భేటీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఇటీవల అలస్కాలో జరిపిన సమావేశం తర్వాత జరిగింది. ఇది శాంతి చర్చలకు ఒక కీలక అడుగుగా పరిగణించబడుతోంది.
ఉక్రెయిన్ త్వరలో శాంతిని చూడబోతుంది-ట్రంప్
ట్రంప్ ఈ సమావేశంలో యుద్ధాన్ని ముగించేందుకు ఒక దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. “ప్రపంచం ఈ యుద్ధంతో అలసిపోయింది. ఉక్రెయిన్ త్వరలో శాంతిని చూడబోతోంది,” అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జెలెన్‌స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, నాటో కార్యదర్శి మార్క్ రట్టేలు పాల్గొన్నారు. ఈ నాయకులు ఉక్రెయిన్‌కు భద్రతా హామీలను అందించడంపై చర్చించారు. ఇది శాంతి ఒప్పందంలో కీలకమైన అంశంగా పరిగణించారు.
యుద్ధానికి దౌత్యపరమరమైన పరిష్కారం కనుగొనాలి-ట్రంప్
ఈ సమావేశంలో ట్రంప్, జెలెన్‌స్కీ పుతిన్‌ల మధ్య ఒక త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకారం, ఈ సమావేశం రాబోయే రెండు వారాల్లో జరగవచ్చని తెలిపారు. అయితే, రష్యా ఇంకా ఈ సమావేశాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. జెలెన్‌స్కీ ఈ సమావేశాన్ని “చాలా ఉత్పాదకమైనది”గా అభివర్ణించారు, గతంలో ఫిబ్రవరిలో జరిగిన ట్రంప్‌తో జరిగిన వివాదాస్పద సమావేశంతో పోలిస్తే ఈ భేటీ సౌహార్దపూరితమైనదని తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉంది-ట్రంప్
జెలెన్‌స్కీ ఉక్రెయిన్ భూభాగాన్ని వదులుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. రష్యాతో శాంతి చర్చలకు భద్రతా హామీలు అవసరమని నొక్కి చెప్పారు. ఈ హామీలలో అమెరికా నుండి సుమారు 90 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల కొనుగోలు ఉండవచ్చని, ఇవి యూరోపియన్ దేశాల ఆర్థిక సహాయంతో రూపొందించబడతాయని తెలిపారు. ట్రంప్ కూడా ఈ భద్రతా హామీలను సమన్వయం చేయడంలో అమెరికా పాత్ర పోషిస్తుందని చెప్పారు. అయితే యూరోపియన్ దేశాలు ప్రధాన బాధ్యత వహించాలని సూచించారు.
కాల్పుల విరమణ కావాలి.. శాంతి కావాలి ట్రంప్
ఈ భేటీలో కాల్పుల విరమణ అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇది గతంలో ఆయన వ్యక్తం చేసిన సీజ్‌ఫైర్ పిలుపుకు విరుద్ధంగా ఉంది. ఈ వైఖరి రష్యాతో అలస్కాలో జరిగిన చర్చల ప్రభావంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈయూ నాయకులు, ముఖ్యంగా మాక్రాన్, మెర్జ్, శాంతి చర్చలకు ముందు కాల్పుల విరమణ అవసరమని వాదించారు.
Also Read: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!
మొత్తంగా.. ఈ సమావేశం ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. అయితే రష్యా స్పందన, భద్రతా హామీలపై స్పష్టత రాబోయే రోజుల్లో కీలకం కానుందన్నారు.