BigTV English

Meta Removes Restrictions: ట్రంప్‌కి శుభవార్త చెప్పిన మెటా..

Meta Removes Restrictions: ట్రంప్‌కి శుభవార్త చెప్పిన మెటా..

Meta Removes Restrictions: అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మెటా శుభవార్త చెప్పింది. ట్రంప్ నకు చెందిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం తెలియజేసింది.


‘రాజకీయ నేతల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అనుమతించడమనేది మా బాధ్యత. అందుకే ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆలోచనలు, మాటలను అమెరికా ప్రజలు వినాలని మేం కోరుకుంటున్నాం. అందరు వినియోగదారుల మాదిరిగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా నిబంధనలకు లోబడి సోషల్ మీడియా ఖాతాలను వినియోగించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో హింసను ప్రేరేపించే విధంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదు’ అంటూ మెటా పేర్కొన్నది.

2021లో క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2023లో వాటిని పునుద్ధరించారు. ఆ సందర్భంగా ట్రంప్ కి కీలక సూచన చేసింది. భవిష్యత్తులో ట్రంప్ నిబంధలను మళ్లీ ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని కూడా పేర్కొన్నది. అయితే, గతేడాది ఆయన ట్విట్టర్ ఖాతాపై ఆంక్షలు ఎత్తివేసినా ట్రంప్ దానిని వినియోగంచలేదు. బదులుగా తన సొంత మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ వేదికగా తన ఆలోచనలను పంచుకుంటున్నారు.


Also Read: ట్రంప్‌ పార్టీకి ఇలాన్ మస్క్ మద్దతు.. ఎన్నికల ప్రచారం కోసం భారీ విరాళం!

అయితే, ట్రంప్‌‌కి ఫేస్‌బుక్‌లో సుమారుగా 34 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా ఆయనకు 2.6 మిలియన సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×