E-Paper
Advertisement

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!
Advertisement

BLF Female Unit: బలూచిస్థాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్’ (BLF) తన కొత్త మహిళా విభాగానికి సంబంధించిన తొలి దాడి వీడియోను విడుదల చేసింది. ఇటీవల ఏర్పాటు చేసిన ‘కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్’ (KAAD) కు చెందిన మహిళా ఫైటర్లు.. పాకిస్థాన్ మిలిటరీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో దాదాపు తొమ్మిది మంది పాకిస్థానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, మిలిటరీ వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బలూచ్ సాయుధ బృందాలు వెల్లడించాయి.

హైవేపై మెరుపు దాడి

సెప్టెంబర్ 22న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) హైవేపై టర్బత్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (QRF) బృందానికి చెందిన మూడు వాహనాలపై కేఏఏడీ మహిళా ఫైటర్లు విరుచుకుపడ్డారు. ముందుగా ఒక మహిళా కమాండర్ ఈ ఆపరేషన్ గురించి దళాలకు దిశా నిర్దేశం చేయగా ఆ తర్వాత ఫైటర్లు.. 5 అడుగుల దూరంలో ఉన్న సాయుధ వాహనాలపై రైఫళ్లతో తూటాల వర్షం కురిపించారు. మహిళా ఫైటర్లు పొందిన కఠిన శిక్షణకు ఈ దాడి నిదర్శనంగా నిలిచింది.

Advertisement

ఎనర్జీస్‌ ప్రాజెక్టుపై రాకెట్ దాడి

మరొక ఘటనలో ‘బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ’ (BRA) డెరా బుగ్తీ ప్రాంతంలోని ‘మారి ఎనర్జీస్ లిమిటెడ్’ ప్రాజెక్ట్ సైట్‌ను లక్ష్యంగా చేసుకుని రాకెట్లు, భారీ ఆయుధాలతో విరుచుకుపడింది. ఈ దాడిలో సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అనంతరం అక్కడకు చేరుకున్న ప్రభుత్వ మద్దతు ఉన్న ప్రైవేటు సాయుధ బృందాలు, పాక్ సైనికులు.. బలూచ్ వేర్పాటువాదులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ దాడిలోనూ బలూచ్ రిపబ్లిక్ ఆర్మీ పైచేయి సాధించి.. 9 మంది మిలిటరీ సిబ్బంది, ముగ్గురు స్థానిక ఆయుధ బృంద సభ్యులను అంతం చేసింది. ఈ తీవ్ర పోరాటంలో తమ వైపు కూడా ఆరుగురు ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారని బీఆర్‌ఏ ప్రతినిధి సర్బాజ్ బలూచ్ వెల్లడించారు.

ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం

Advertisement

ఇదిలా ఉంటే మరో బలూచ్ సాయుధ బృందం ‘బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్’ (BRG) హాజీ షెహర్ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని, అక్కడి పోలీస్ స్టేషన్‌ను పేలుడు పదార్థాలతో పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే బీఆర్‌ఏ ఫైటర్లు ఏరీ షెహర్ ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడి ప్రభుత్వ కార్యాలయాలను కొంతసేపు తమ నియంత్రణలోకి తీసుకుని.. ఆపరేషన్ పూర్తయ్యాక వెనక్కి తగ్గారు. ప్రస్తుతం బలూచిస్థాన్‌లో పాక్ సైనిక దళాలు, మౌలిక వసతులే లక్ష్యంగా బలూచ్ తిరుగుబాటుదారులు దాడులను మరింత తీవ్రతరం చేశారు.

Also Read: జీతం ఎక్కువ ఉన్నా ధనవంతులు కాలేకపోతున్నారా? కోటీశ్వరులను చేసే.. 5 గోల్డెన్ సూత్రాలు మీకోసం!

కరీమా బలూచ్ జ్ఞాపకార్థం కొత్త విభాగం

ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా విభాగానికి ప్రముఖ బలూచ్ నాయకురాలు కరీమా బలూచ్ పేరు పెట్టారు. బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్-ఆజాద్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన కరీమా బలూచ్.. బలూచిస్థాన్ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ సైన్యం వేధింపుల కారణంగా కెనడాలో తలదాచుకున్న ఆమె.. 2020లో టొరంటోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె పోరాట స్ఫూర్తితోనే ఈ కొత్త మహిళా పోరాట విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు బలూచ్ వర్గాలు ప్రకటించాయి.

Also Read: కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

Tags

Related News

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

Big Stories

Advertisement
×