E-Paper
Advertisement

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!
Advertisement

Krishna Butterball Mystery: గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఎత్తైన ప్రాంతాల నుంచి వస్తువులు, రాళ్లు కిందకు జారిపడటం సహజం. ఇక కొండ వాలు పైనున్న రాళ్లు అయితే కొద్దిపాటి రాపిడికే కిందకు దొర్లుతుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా తమిళనాడులోని మహాబలిపురంలో ఓ భారీ రాయి ఏళ్ల తరబడి కొండ వాలుపై స్థిరంగా నిలబడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 1200 ఏళ్లకు పైగా కొండ వాలుపై ఉన్న ఈ రాయిని ‘కృష్ణుడి వెన్నముద్ద’గా పిలుస్తున్నారు. ఎంతోమంది దీనిని కదిలించేందుకు ప్రయత్నించినా.. భారీ వర్షాలు, తుపానులు ఎదురైన ఇసుమంతైనా కదలకుండా ఏళ్ల తరబడి అలాగే ఉండటం విశేషం.

వెన్నముద్ద అనేది ఎందుకు?

తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఈ భారీ గ్రానైట్ రాయి ఎత్తు దాదాపు 20 అడుగులు (6 మీటర్లు), వెడల్పు 16 అడుగులు (5 మీటర్లు) ఉంటుంది. దీని బరువు సుమారు 250 టన్నులు. స్థానికులు దీనిని “వాన్ ఇరై కల్” అని పిలుస్తారు. అంటే తమిళంలో ‘ఆకాశ దేవుడి రాయి’ అని అర్థం. బాలకృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టమని ఆయన తింటూ కింద పడేసిన వెన్నముద్దే కాలక్రమంలో ఇలా రాయిగా మారిందనేది ఇక్కడి ప్రజల నమ్మకం. గోళాకారంలో వెన్నముద్దను పోలి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.

ఏనుగులు లాగినా కదల్లేదట!

Advertisement

ఈ రాయికి సంబంధించి చరిత్రలో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. పూర్వం పల్లవ రాజులు ఈ రాయిని అక్కడ నుంచి తొలగించాలని ప్రయత్నించారని.. శక్తివంతమైన ఏనుగులను ఉపయోగించినా ఇది ఇంచు కూడా కదల్లేదని చెబుతారు. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో మద్రాస్ గవర్నర్‌గా ఉన్న ఆర్థర్ లాలీ సైతం ఏడు ఏనుగులను కట్టి ఈ రాయిని లాగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఏనుగుల సమూహ శక్తి కూడా ఈ రాయి ముందు ఓడిపోయింది.

శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

పరిశోధకుల ప్రకారం.. ఈ రాయి కొండ వాలుపై ఇలా నిలబడటం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. బయటకు ఇది గుండ్రటి బంతిలా కనిపిస్తున్నప్పటికీ నిజానికి ఇది సంపూర్ణ గోళాకారం కాదని శాస్త్రవేత్తల వాదన. వారి ప్రకారం రాయి అడుగు భాగం వెడల్పుగా ఉంది. రాయి ఆకారం, కొండ వాలు కోణం, రాయికి-నేలకి మధ్య ఉన్న ఘర్షణ (Friction) కారణంగానే ఇది కిందకు దొర్లకుండా స్థిరంగా బ్యాలెన్స్ అయి ఉంది. రాయి గురుత్వ కేంద్రం స్థిరంగా ఉండటంతో తీవ్ర తుఫాన్లు, వర్షాలు వచ్చినా ఇది కదలకుండా నిలబడగలిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

యునెస్కో గుర్తింపు

Advertisement

ప్రస్తుతం ఈ రాయి మహాబలిపురంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల (UNESCO World Heritage Site) జాబితాలో భాగంగా ఉంది. దీనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పర్యవేక్షిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఈ రాయి కింద నిలబడి ఫొటోలు దిగుతుంటారు. పిల్లలు దీని చుట్టూ సరదాగా అడుకుంటారు. 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల ద్వైపాక్షిక సమావేశం సందర్భంలో వారు ఈ రాయి ముందు ఫొటోలు దిగడంతో అప్పట్లో ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది.

Also Read: Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

అక్కడికి చేరుకోవడం ఎలా?

ఈ మిరాకిల్ రాయి వద్దకు చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ రాయి ఉన్న మహాబలిపురం ప్రాంతం.. చెన్నైకి సుమారు 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానంలో వచ్చేవారైతే ముందుగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంకు వచ్చి.. అక్కడ నుంచి ఈస్ట్ కోస్ట్ రోడ్ ద్వారా కార్లు లేదా టాక్సీలలో 1.5 గంటల్లో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే.. దగ్గర్లోని చెంగల్పట్టు జంక్షన్ (29 కి.మీ) లో దిగితే అక్కడ నుంచి స్థానిక బస్సులు లేదా టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఇక రోడ్డుమార్గంలో వెళ్లేవారి కోసం.. చెన్నై, పాండిచ్చేరి, కాంచీపురం నుంచి మహాబలిపురానికి నేరుగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సు సౌకర్యం ఉంది.

Also Read: కేంద్రం అదిరిపోయే స్కీమ్.. రూ. 210తో జీవితాంతం రూ. 5,000 పెన్షన్.. మధ్యతరగతికి పండగే!

Tags

Related News

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

Advertisement
×