E-Paper
Advertisement

Bangladesh Election Results: బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు.. నాల్గవసారి ప్రధానిగా షేక్ హసీనా

Bangladesh Election Results: బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు.. నాల్గవసారి ప్రధానిగా షేక్ హసీనా
Advertisement

Bangladesh Election Results: బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. అవామీ లీగ్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆదివారం పోలింగ్‌ జరగ్గా అర్థరాత్రి సమయానికి ఫలితలు వెలువడ్డాయి. మిత్రపక్షాలతో కలిసి 299 స్థానాల్లో పోటీ చేసిన అవామీ లీగ్ 223 చోట్ల విజయం సాధించింది. భారీ మెజార్టీతో కూటమిని విజయ తీరాలకు నడింపించిన షేక్ హసీనా నాలుగోసారి ప్రధాని పీఠంపై కూర్చోనున్నారు.

ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ పోలింగ్ కు ముందే చేతులెత్తేసింది. బీఎన్పీతో పాటు విపక్షాలన్నీ ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో.. ప్రజలు కూడా పోలింగ్ కు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం 40 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించారు. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్‌ జరిగింది. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే.. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌, దాని మిత్రపక్షాలు 223 చోట్ల విజయం సాధించాయి. అయితే, 2018 ఎన్నికల్లో 80శాతం పోలింగ్ జరిగింది. కానీ.. ఈ సారి అందులో సగం కూడా నమోదవ్వపోవడంపై చర్చ జరుగుతోంది.

Advertisement

తటస్థ ప్రభుత్వం నేతృత్వంలోనే జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ.. విపక్షాల డిమాండ్‌ను ప్రధాని షేక్‌ హసీనా తిరస్కరించారు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తూ సమ్మెకు పిలుపునిచ్చాయి. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా ఓరైలు కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదురుగు సజీవ దహనం అయ్యారు. ఈ ఆందోళనల మధ్యే ఎన్నికలు జరిపారు. దీంతో.. ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. అందుకే.. 40 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×