Big Stories

Bangladesh MP Murder Case: బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. కాల్వ ఒడ్డున ఎముకలు లభ్యం..!

Update on Bangladesh MP Murder Case: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన ఈ హత్య కేసులో ముమ్మరంగా చేపట్టిన దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. గతంలో ఓ అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో మాంసపు ముద్దలు గుర్తించిన పోలీసులు.. తాజాగా, ఓ కాల్వలో ఎముకలు గుర్తించారు. అంతకుముందు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని నేపాల్‌లో పోలీసులు అరెస్ట్ చేసి భారత్‌కు తీసుకొచ్చారు. తర్వాత నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

ఆ ఎముకలు అతడివేనా..?

- Advertisement -

బంగ్లా ఎంపీ హత్య కేసులో ప్రధాన నిందితుడు సియామ్ హుస్సేన్‌ను సీఐడీ అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ విచారణలో నిందితుడి నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హత్యకు గురైన ఎంపీ శరీరీ భాగాలను వేరే వేరే ప్రాంతాల్లో పారవేయడంలో సియామ్ హుస్సేన్ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. దీంతో వెంటనే అధికారులు గాలింపు చేపట్టడంతో ఓ కాల్వ ఒడ్డున మానవ ఎముకలు లభ్యమయ్యాయి. తర్వాత వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పరీక్షలు జరిపిస్తామన్నారు. ఆ లభ్యమైన మానవ ఎముకలు బంగ్లా ఎంపీ అన్వరుల్ అజీమ్‌వేనని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read: కెనడాలో ఇందిరాగాంధీ హత్య పోస్టర్లు.. స్పందించిన మంత్రి

కీలకంగా మారున్న డీఎన్‌ఏ..

శరీర ఎముకలు లభ్యమైన కాల్వ ప్రాంతం.. హత్యకు గురైన ఎంపీ మాంసపు ముద్దలు లభ్యమైన అపార్ట్‌మెంట్‌కు 15 కి.మీల దూరంలో ఉందని తేలింది. అయితే ఎంపీని హత్య చేసిన తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేయడంతో నిర్ధారించడం కష్టంగా మారింది. ఇప్పటికే అధికారులు లభ్యమైన శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్ష కీలకంగా మారనుంది. కాగా, బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ వైద్యం కోసం ఈనెల 12న కోల్‌కతా వచ్చారు. అనంతరం ఆయనను హనీట్రాప్‌లోకి నెట్టి హత్య చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News