Swimming Pools: సమ్మర్ వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి స్మిమ్మింగ్‌పూల్స్‌లో దూకుతుంటారు చాలా మంది. చల్లటి నీటిలో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా జర్మనీలోని బెర్లిన్‌లో మహిళలు స్విమ్మింగ్ చేయడానికి సంబంధించి సరికొత్త నియమాన్ని తీసుకొచ్చారు. మహిళలు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు.
ఇటీవల ఓ మహిళ ఓపెన్ ఎయిర్‌పూల్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా.. ఆమెను పూల్ నిర్వాహకులు బయటకు గెంటేశారు. టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు ఆమెకు అనుమతివ్వలేదు. దీంతో సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరింది.
ఈమేరకు కోర్టు ఆమెకు మద్ధతుగా తీర్పునిచ్చింది. మహిళలు కూడా పురుషులతో సమానంగా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇకపై బెర్లిన్‌లో మహిళా టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేయవచ్చు.