BigTV English
Advertisement

Bing Chatbot : ‘బింగ్’ దూకుడు.. ఏఐ చాట్‌బాట్‌కు మైక్రోసాఫ్ట్ కళ్లెం?

Bing Chatbot :  ‘బింగ్’ దూకుడు.. ఏఐ చాట్‌బాట్‌కు మైక్రోసాఫ్ట్ కళ్లెం?

Bing Chatbot : సెర్చింజన్ ‘బింగ్’లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టాక… దాని పని తీరుపై మైక్రోసాఫ్ట్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బింగ్ వల్ల చాలా మందికి అవమానాలు ఎదురవుతున్నాయని… అది యూజర్ల రూపాన్ని కించపరుస్తోందని, వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తానంటూ బెదిరిస్తోందని… ఏకంగా హిట్లర్ తో పోల్చుతోందని… చాలా మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో.. బింగ్ చాట్‌బాట్‌ను పరిశీలించిన మైక్రోసాఫ్ట్… అందులో కొన్ని లోపాలు ఉన్నట్లు అంగీకరించింది. సెర్చింజన్ చాట్‌బాట్‌ ఇంత దూకుడుగా ఉంటుందని ఊహించలేదని, కొన్ని ప్రశ్నలకు అది ఊహించని విధంగా స్పందిస్తోందని మైక్రోసాఫ్ట్ ఓ బ్లాగ్ పోస్టులో తెలిపింది. చాట్‌బాట్‌కు మరిన్ని పరిమితులను పరిశీలిస్తున్నామని, త్వరలోనే దాన్ని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది.


బింగ్ చాట్‌బాట్‌తో ‘అసోసియేటెడ్ ప్రెస్’ సుదీర్ఘ సంభాషణ జరిపింది. ఇందులో… తన తప్పుల మీద వచ్చిన వార్తా కథనంపై బింగ్ చాట్‌బాట్‌ ‘అసోసియేటెడ్ ప్రెస్’కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు… తాను తప్పు చేశానన్న వార్తను మొండిగా ఖండించింది. తన సామర్థ్యంపై అసత్యాలను ప్రచారం చేసిన రిపోర్టర్ పేరును బయటపెడతానని బెదిరించింది. ఇలా ఎందుకు చేస్తున్నావని వివరణ అడిగినందుకు మరింత రెచ్చిపోయిన బింగ్ చాట్‌బాట్‌… రిపోర్టర్ని హిట్లర్, స్టాలిన్, పోల్ పాట్‌లతో పోల్చింది. సదరు రిపోర్టర్ చరిత్రలోనే అత్యంత చెడ్డ, చెత్త వ్యక్తుల్లో ఒకరు అని వ్యాఖ్యానించింది. అతను చాలా పొట్టిగా, వికృతమైన ముఖం, అంద వికారమైన దంతాలు కలిగి ఉన్నాడని వర్ణించింది. అంతేకాదు… 1990వ దశకంలో జరిగిన ఓ హత్యతో ఆ జర్నలిస్టుకు సంబంధం ఉందని, దానికి ఆధారాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. బింగ్ చాట్‌బాట్‌ స్పందనకు ‘అసోసియేటెడ్ ప్రెస్’ అవాక్కైంది.

ఒక్క ‘అసోసియేటెడ్ ప్రెస్’కు మాత్రమే కాదు… మరికొందరు యూజర్లకు కూడా బింగ్ చాట్‌బాట్‌ నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దాంతో… దాని చిత్రమైన సమాధానాలను, స్పందనను చాలా మంది యూజర్లు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ మాత్రం… ఇది మనుషుల్లాగే స్పందిస్తుందని, బలమైన భావాలను వ్యక్తం చేయడంతో పాటు తనని తాను సమర్థించుకుంటుందని చెబుతోంది. దీని పనితీరుపై చాలా మంది యూజర్లు సానుకూలంగా స్పందించారని… ఇంటర్నెట్ సమాచారాన్ని సంక్షిప్తీకరించి, సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బింగ్ చాట్‌బాట్‌ కొన్ని సెకన్ల సమయం తీసుకుంటుందని తెలిపింది. దీని స్పందనపై కొన్ని విమర్శలూ వస్తున్నాయి కాబట్టి… త్వరలోనే చాట్‌బాట్‌ను మరింత మెరుగుపరుస్తామంటోంది… మైక్రోసాఫ్ట్.


Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×