Pakisthan: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ లోని క్వెట్టా రైల్వే స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక రైలు ఫ్లాట్ ఫారమ్ నుండి పెషావర్ బయలు దేరడానికి సిద్ధంగా ఉండటంతో దాదాపు 100 మంది ప్రయాణికులు అక్కడ ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు క్వెట్టాలో ఒకదాని తరవాత ఒకటి రెండు బాంబు పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. మొదటి పేలుడులో నలుగురు మరణించగా, రెండవ పేలుడు ఘటనలో దాదాపు 15 నుండి 26 మంది మరణించారని సమాచారం.
ఈ ఘటనపై క్వెట్టా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ మహ్మద్ బలోచ్ స్పందించారు. ఆత్మాహుతి దాడిలా ఈ ప్రమాదం కనిపిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నింధితులను పట్టుకుంటామని అన్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నందున వచ్చిన నివేధిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. గాయపడిన ప్రయాణికుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ లోని ప్రావిన్స్, బలూచిస్తాన్ వేర్పాటువాద తీవ్రవాదులకు నిలయంగా మారాయి. గతంలో కూడా ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయి.