E-Paper
Advertisement

Border Standoff: భారత్, చైనా మధ్య సయోధ్య.. హర్షం వ్యక్తం చేసిన అమెరికా

Border Standoff: భారత్, చైనా మధ్య సయోధ్య.. హర్షం వ్యక్తం చేసిన అమెరికా
Advertisement

Border Standoff: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం గత కొన్ని సంవత్సరాలు నుంచి కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోకున్నా.. గత కొన్నేళ్లుగా ఇరు పక్షాలు భారీ స్థాయిలో సైనికులను మొహరించడంతో పలు అపోహాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడంతో పాటు భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న కృషితోపాటు సరిహద్దులో సైనికుల తొలగింపు వంటి విషయాలను గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ..

Advertisement

తూర్పు లద్దాఖ్‌లో 2020లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు ఇటీవల భారత్, చైనా సైనిక చర్చలు జరిపాయి. ప్రధానంగా ఇందులో ఇరు దేశాల సైనికుల మొహరింపును ఉపసంహరించుకోవాలని చర్చించారు. ఈ విధంగా ఇరు దేశాలు స్నేహ పూర్వక వాతావరణంలో చర్చలు ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు గమనిస్తుంటామని అమెరికా తెలిపింది.

Also Read: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..

Advertisement

మద్దతు ఇస్తాం..

చైనాతో నెలకొన్న సరిహద్దు సమస్యల పరిష్కారంపై భారత్ ఫోకస్ చేసిందని భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జై శంకర్ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ కాంప్‌బెల్‌ స్పందించారు. ఇరు దేశాలు సరిహద్దు సమస్యపై ఓ నిర్ణయానికొస్తే.. మద్దతు ఇస్తామని ప్రకటించారు. భారత్‌తో సొంత ద్వైపాక్షిక సంబంధాల కోసం వాషింగ్టన్ సౌకర్యంగా ఉందని, ఈ సమస్య పరిష్కారమై ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×