E-Paper
Advertisement

ఫ్రిడ్జ్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే.. కరెంట్ బిల్లు తగ్గడంతో పాటు రిఫ్రిజిరేటర్ లైఫ్ కూడా పెరుగుతుంది!

ఫ్రిడ్జ్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే.. కరెంట్ బిల్లు తగ్గడంతో పాటు రిఫ్రిజిరేటర్ లైఫ్ కూడా పెరుగుతుంది!
Advertisement

Fridge Power Saving Tips: ఇంట్లో ఉండే మిగతా వస్తువులతో పోలిస్తే ఫ్రిడ్జ్ ప్రత్యేకమైంది. ఎందుకంటే.. ఇది రోజంతా నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది. అందుకే మన కరెంట్ బిల్లు పెరగడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. అయితే ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గకుండానే, కరెంట్ బిల్లును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన టెంపరేచర్ సెట్టింగ్స్:

ఫ్రిడ్జ్ కరెంట్ వినియోగాన్ని తగ్గించడానికి చేయాల్సిన మొదటి పని టెంపరేచర్‌ను కరెక్ట్‌గా సెట్ చేయడం. సాధారణంగా ఫ్రిడ్జ్ లోపలి భాగాన్ని 3°C నుండి 5°C మధ్య, అలాగే ఫ్రీజర్‌ను -18°C వద్ద ఉంచడం మంచిది. అంతకంటే తక్కువకు తగ్గిస్తే కంప్రెషర్‌పై భారం పడి, ప్రతి డిగ్రీకి 5 శాతం అదనపు కరెంట్ ఖర్చవుతుంది.

ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంచాలి?

Advertisement

చాలామంది ఫ్రిడ్జ్‌ను తమకు వీలైన చోట పెట్టేస్తుంటారు. కానీ పొయ్యి, ఓవెన్ వంటి వేడి ఎక్కువగా ఉండే వస్తువుల పక్కన ఫ్రిడ్జ్ ఉంచకూడదు. దీనివల్ల ఫ్రిడ్జ్ లోపల చల్లదనం తగ్గకుండా ఉండేందుకు కంప్రెషర్ ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. అలాగే ఫ్రిడ్జ్ వెనుక, పక్క భాగాల్లో 5 నుండి 10 సెంటీమీటర్ల గ్యాప్ వదిలితే వేడి సులభంగా బయటకు పోతుంది.

Also Read: రెండేళ్ల సీక్రెట్ ప్రాజెక్ట్.. స్మార్ట్‌ఫోన్ల హిస్టరీలోనే మొదటిసారి వివో నుంచి అలాంటి సూపర్ చిప్!

డోర్ రబ్బర్ లీకేజీలు:

Advertisement

ఫ్రిడ్జ్ డోర్‌కు ఉండే రబ్బర్ గ్యాస్కెట్ లోపలి చల్లటి గాలి బయటకు పోకుండా చూస్తుంది. ఒకవేళ ఇది పాడైతే బయట ఉండే వేడి గాలి లోపలికి వెళ్లి, ఫ్రిడ్జ్ ఎక్కువ కరెంట్ లాగుతుంది. అందుకే రెండు నెలలకొకసారి ఈ రబ్బర్‌ను సోపు నీళ్లతో శుభ్రం చేస్తూ, అది సరిగ్గా అంటుకుంటుందో లేదో చూసుకోవాలి.

డిఫ్రాస్టింగ్ చేయడం ముఖ్యం:

ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా పేరుకుపోవడం సహజం అనుకుంటే పొరపాటే. ఐస్ పొర 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ లావుగా ఉంటే, అది కూలింగ్‌ను అడ్డుకుంటుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. మీ ఫ్రిడ్జ్‌లో ఆటో డిఫ్రాస్ట్ ఆప్షన్ లేకపోతే, ఐస్ పెరిగినప్పుడు మాన్యువల్‌గా డిఫ్రాస్ట్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు.

Also Read: కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేబ్యాక్.. Lenovo Yoga Earbuds ప్రత్యేకతలు ఇవే!

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×