BigTV English

Bangladesh PM Sheikh Hasina: ‘మీ భార్యల భారతీయ చీరలు కాల్చండి’.. విపక్షానికి బంగ్లా ప్రధాని సవాల్!

Bangladesh PM Sheikh Hasina: ‘మీ భార్యల భారతీయ చీరలు కాల్చండి’.. విపక్షానికి బంగ్లా ప్రధాని సవాల్!
Bangladesh PM Sheikh Hasina news
Bangladesh PM Sheikh Hasina

Bangladesh PM Sheikh Hasina news(International news in telugu): భారతీయ ఉత్పుత్తులను బహిష్కరించాలంటూ బంగ్లాదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ ప్రచార ఉద్యమాన్ని లెవనెత్తింది. బంగ్లాదేశ్ లోని నేషనలిస్ట్ పార్టీ(బీఎస్పీ) ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. గత కొన్ని రోజులుగా అక్కడి సోషల్ మీడియాలో దీనిపై జోరుగా ప్రచారం సాగుతోంది.


భారతదేశం బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని దానికి వ్యతిరేకంగా తాము ఈ ఉద్యమం చేపడుతున్నట్లు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తెలిపింది. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చేపడుతున్న ఈ ఉద్యమంపై బంగ్లా ప్రధాని ప్రధానమంత్రి షేక్ హసీనా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

నిజంగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలనే తపనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలకు ఉంటే.. మీ భార్యలు ధరించే చీరలన్నీ సేకరించి పార్టీ ఆఫీసులు ఎదుట తగలబెట్టాలని సవాల్ విసిరారు. దీంతో పాటుగా నిజంగా బీఎస్పీ పార్టీ నేతలంతా భారత్ ప్రోడక్ట్స్ బహిష్కరించాలనుకుంటే భారతీయ మసాలాలు లేకుండా వంటకాలు తినడం ప్రారంభించాలని.. ఆ పని వాళ్ల చేయగలరా? మసాలాలు లేకుండా వినగలరా..? అని షేక్ హసీనా వాటిని ధీటుగా ప్రశ్నించారు.


Also Read: Pakistan: తోషాఖానా అక్రమాస్తుల కేసు.. ఇమ్రాన్ ఖాన్ దంపతుల శిక్ష సస్పెండ్..

అయితే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నేతలు ఖండించారు. ప్రధాని షేక్ హసీనా, ఆమెకు చెందిన రాజకీయ పార్టీ అవామీ లీగ్ లు కూడా ఇండియా ప్రోడక్ట్స్ లాగనే పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఆ రెండింటిని కూడా బాయ్ కాట్ చేయాలని వారు పిలిపునిచ్చారు.

Tags

Related News

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

Big Stories

×