BigTV English

Bus crash in Iran: బ్రేక్స్ ఫెయిలై బస్సు బోల్తా.. 35 మంది యాత్రికులు మృతి

Bus crash in Iran: బ్రేక్స్ ఫెయిలై బస్సు బోల్తా.. 35 మంది యాత్రికులు మృతి

Bus crash in Iran kills 35 Pakistani pilgrims: ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ నుంచి ఇరాన్ బయలుదేరిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మంది పాకిస్థాన్ యాత్రికులు మృతి చెందారు.


ఇరాన్‌లోని యాజ్ద్‌లో చెక్ పాయింట్ వద్ద బస్సు బోల్తా పడింది. 35 మంది మృతి చెందగా.. 18 మందికి పైగా గాయాలబారిన పడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికుల్లో ఎక్కువమంది లర్కానా, సింధ్, ఘోట్కీ నగరాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు.

వివరాల ప్రకారం.. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే బస్సు బోల్తా పడిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నం చేసిన అవకాశం లేకపోవడంతో అక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read:  ‘జాకిర్ నాయక్‌ని తిరిగి పంపించేస్తాం.. భారత్‌తో సంబంధాలు ముఖ్యం’: మలేషియా ప్రధాని

సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 11మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు యాజ్డ్ ప్రావిన్స్ సంక్షోభ నిర్వహణ డైరెక్టర్ జనరల్ చెప్పారు.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×