BigTV English

Zakir Naik Malaysia: ‘జాకిర్ నాయక్‌ని తిరిగి పంపించేస్తాం.. భారత్‌తో సంబంధాలు ముఖ్యం’: మలేషియా ప్రధాని

Zakir Naik Malaysia: ‘జాకిర్ నాయక్‌ని తిరిగి పంపించేస్తాం.. భారత్‌తో సంబంధాలు ముఖ్యం’: మలేషియా ప్రధాని

Zakir Naik Malaysia news(Today’s international news): మలేషియాలో శరణార్థిగా ఉంటున్న ప్రముఖ ఇస్లాం మత ప్రచారకుడు జాకిర్ నాయక్‌ని తిరిగి భారత్ కు పంపించేస్తామని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రాహీం అన్నారు. భారతదేశ పర్యటనలో ఉన్న మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం మంగళవారం రాత్రి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫెయిర్స్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాకిర్ నాయక్ ని తిరిగి ఇండియాకు పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉంటే చూపాలని అడిగారు. కేవలం ఒక జాకిర్ నాయక్ కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తినకూడదని ఆయన చెప్పారు.


జాకిర్ నాయక్ మలేషియాలో ఎందుకు ఉన్నాడు?
భారత దేశంలో ఇస్లామిక్ తీవ్రవాదం, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జాకిర్ నాయర్ 2016లో మలేషియాకు పారిపోయాడు. మలేషియాలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అతనికి పర్మినెంట్ రెసిడెన్సీ అనుమతులు ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం భారత్ పర్యటనలో స్వయంగా ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జాకిర్ నాయక్ ని తిరిగి మలేషియా ప్రభుత్వం ఇండియాకు అప్పగించాలని అడిగారని ఇబ్రహీం గుర్తుకు చేశారు.

Also Read:  ‘అమెరికాకు రావొద్దు.. గ్రీన్ కార్డ్ కోసం 100 ఏళ్లు వెయిట్ చేయాలి’.. ఇండియన్ టెకీ హెచ్చరిక!


మలేషియా ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతూ.. అన్వర్ ఇబ్రహీం జాకిర్ నాయక్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉంటే తమకు చూపాలని.. వాటిని తప్పకుండా పరిశీలిస్తామని అన్నారు. అయితే ఈ ఒక్క అంశంతో ఇరు దేశాల మధ్య స్నేహం, ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం ఉండకూడదని వ్యాఖ్యానించారు. అలాగే గాజాలో పాలస్తీనా వాసుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని పశ్చిమ దేశాలు నిర్లక్ష్యం చేస్తూ.. ఇతర దేశాల్లో జరుగుతున్న హింసను మాత్రం ఖండించడం ఆ దేశాల కపటత్వమని తెలిపారు. ”గాజాలో 40 వేల మందిని చంపేశారు అయినా పశ్చిమ దేశాలు కపటత్వ మాత్రం మానుకోలేదు.” అని అన్నారు.

Also Read: ఆ దేశంలో పిల్లుల పెంపకం కోసం పార్లమెంట్ లో ఏకంగా రూ.12 లక్షల బడ్జెట్ కేటాయింపు?

2022లో మలేషియా ప్రధాన మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తరువాత అన్వర్ ఇబ్రహీం భారత దేశానికి మూడు రోజుల పర్యటనకు విచ్చేశారు. ఈ పర్యటనలో ఆయన ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయాలని సూచించారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×