BigTV English

Sunitha Williams Barry Wilmore: సునీతాతో వచ్చిన బుచ్ విల్మోర్ ఎవరో తెలుసా? నింగి, నేల.. ఇతడికి జుజుబి

Sunitha Williams Barry Wilmore: సునీతాతో వచ్చిన  బుచ్ విల్మోర్ ఎవరో తెలుసా? నింగి, నేల.. ఇతడికి జుజుబి

Sunitha Williams Barry Wilmore: ఇప్పుడంతా మీడియాలో ఒకటే చర్చ. అదే తొమ్మిది నెలలు ఎక్కడో అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములు అయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు ఎలా తిరిగి వచ్చారని. వీరిద్దరూ ఇంత సుదీర్ఘకాలం పాటు ఇంటికి, దేశానికి, తమ గ్రహానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అక్కడికి వెళ్లడానికి వీరు ప్రయాణించిన అంతరిక్షం వాహనంలో సమస్యలు రావడంతో వీరిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత వీరిని తిరిగి తీసుకురావడానికి నియమాలు, నిబంధనలు అడ్డుగా నిలిచాయి. దీంతో తమ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్నా.. సంయమనంతో అక్కడ మనుగడ సాధించారు. ముఖ్యంగా సునీతా విలియమ్స్ కు బుచ్ విల్మోర్ అండగా నిలిచారు. ఇంతకాలం అక్కడ వీరివురూ తమ ప్రాణాలు నిలుపోగలిగారేంటే దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి వీరికి ఇచ్చిన శిక్షణ, రెండు బుచ్ విల్మోర్ సుదీర్ఘ అనుభవం, కష్ట పరిస్థితుల్లో రాణించగల నైపుణ్యం. ఒక థ్రిల్లర్ సినిమాని తలపించే ఈ కథలో అసలు హీరో బుచ్ విల్మోర్.


ఎవరు ఈ బుచ్ విల్మోర్ ?
బ్యారీ బుచ్ విల్మోర్.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా కు చెందిన ఒక వ్యోమగామిగా ఇప్పుడు ప్రపంచానికి పరిచయమయ్యారు. అయితే ఆయన ఇంతకుముందు కూడా తన కెరీర్‌లో ఎన్నో కష్టాలకు ఓర్చి విజయాలను సాధించారు. అమెరికా నావికా దళంలో కెప్టెన్ గా పని చేసిన ఆయనకు అంతరిక్ష విమానాలకు నడిపే అనుభవముంది. దాంతో పాటు చాలా మిషన్లకు విజయవంతంగా సారథ్యం వహించారు. అంతరిక్షంలో మిషన్లు నిర్వహించిన అనుభవమున్న వ్యోమగామి అయిన బ్యారీ బుచ్ విల్మోర్ గత జూన్ 5, 2024న స్టార్ లైనర్ క్రూ టెస్ట్ ఫ్లైట్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ విమానంలోనే ఆయనతోపాటు వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రయాణించారు.

అమెరికాలోని టెన్నెసె రాష్ట్రం మర్‌ఫ్రీస్‌బోరో ప్రాంతంలో డిసెంబర్ 29, 1962 న జన్మించిన విల్మోర్ ఇంజినీరింగ్, ఏవిషియన్ లో విద్యను అభ్యసించారు. టెన్నెసె టెక్నాలాజికల్ యూనివర్సిటీ నుంచి ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికా నావికా దళంలో చేరారు.


నావికా దళంలోని యుద్ధ విమానాల టెస్ట్ పైలట్ గా ఆయనకు సుదీర్ఘ అనుభవముంది. అక్కడ పనిచేస్తూ ఆయన యుద్ధ విమానాలను, కొత్త టెక్నాలజీ విమానాలను టెస్టింగ్ చేసేవారు. ఈ అపార టెక్నాలజీ అనుభవం ఉండడంతో ఆయనను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా నుంచి పిలుపు వచ్చింది. నాసా ఆయనకు వ్యోమగామిగా ఎంపిక చేసింది.

Also Read: అంతరిక్షంలో వ్యవసాయం చేసిన సునీత !

నాసాలో బుచ్ విల్మోర్ చేపట్టిన మిషన్స్
2000 సంవత్సరంలో నాసా వ్యోమగామిగా ఎంపికైన తరువాత ఆయన మొత్తం 178 రోజులు పాటు అంతరిక్షంలోనే ఉండి రెండు కీలక స్పేస్ మిషన్లు పూర్తి చేశారు.

1. STS-129 (2009, అట్లాంటిస్ స్పేస్ షటిల్ విమానం)
నాసాలో బుచ్ విల్మోర్ కు అంతరిక్ష విమానాల గురించి శిక్షణ లభించింది. దీంతో పాటు అంతరిక్షంలో ఎలా జీవనం సాగించాలో.. అక్కడి వాతావరణానికి అనుకూలంగా మానవ శరీరం తట్టుకునేలా ఆయనకు శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత 2009లో మొదటిసారి బుచ్ విల్మోర్ స్పేస్ షటిల్ అట్లాంటిస్ (STS-129) అనే అంతరిక్ష విమానానికి టెస్ట్ పైలట్ గా వ్యవహరించారు. ఈ విమానంలో ఆయన అంతరిక్షంలోని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ముఖ్యమైన విమాన పరికరాలు తీసుకెళ్లారు. 11 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో.. విల్మోర్ లోని పైలట్ స్కిల్స్ బయటపడ్డాయి. దాంతో ఆయన అంతరిక్షంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలను తన టీమ్ తో కలిసి సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

2. ఎక్సెపెడిషన్ 41/42 (2014-2015 అంతర్జాతీయ స్పేస్ స్టేషన్)
2009లో విల్మోర్ నైపుణ్యాన్ని చూసిన నాసా అధికారులు ఆయనకు 2014లో మరోసారి ఎక్సెపెడిషన్ 41 మిషన్ లో అంతరిక్ష విమానంలో ఫ్లైట్ ఇంజినీర్ గా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత అదే మిషన్ రెండో భాగంలో ఎక్సెపెడిషన్ 42లో ఆయనకు కమాండర్ గా ప్రమోట్ చేశారు. ఈ రెండు మిషన్ లలో ఆయన 167 రోజులపాటు అంతరిక్షంలోనే ఉన్నారు. అంతరిక్ష విమానాలను వదిలి మూడు సార్లు స్పేష్ లో వాక్ చేస్తూ.. విమానాలకు, స్పేస్ స్టేషన్‌కు హార్డ్ వేర్ ఇన్‌స్టాల్ చేసి ముఖ్యమైన రిపేర్లు కూడా చేశారు. దీంతో అక్కడ పరిశోధకులకు ఎంతో సహాయపడ్డారు.

సునీతా విలియమ్స్ తో బోయింగ్ స్టార్ లైనర్ క్రూ ఫ్లైట్
అంతరిక్షలో సామాన్య జనాలను తీసుకెళ్లేందుకు బోయింగ్, స్పేస్ ఎక్స్ అనే కంపెనీలు కొత్త విమానాలు తయారు చేశాయి. వీటిలో తొలిగా బోయింగ్ స్టార్ లైనర్ అనే విమానం జూన్ 2024లో అంతరిక్షంలో 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది ఒక టెస్ట్ ఫ్టైట్. ఈ విమానం నడిపేందుకు పైలట్ గా బ్యారీ బుచ్ విల్మోర్ ఎంపిక కాగా ఆయనకు కో పైలట్ గా మరో వ్యోమగామి సునీతా విలియ్స్ ఉన్నారు. ఈ విమానంలో అంతరిక్షానికి చేరుకొని తిరిగి భూమికి సురక్షితంగా వస్తే.. మిషన్ విజయవంతమయ్యేది. కానీ అలా జరగలేదు. స్టార్ లైనర్ అంతరిక్షంలోకి బయలుదేరిన తరువాత నుంచి విమానంలో చాలా సమస్యలు వచ్చాయి. అయినా విల్మోర్ తన అనుభవంలో స్టార్ లైనర్ విమానాన్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. కానీ విమానం థ్రాటిల్స్ (విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఉపయోగపడే ఇంజిన్ పరికరాలు) లో హీలియం ధ్రవం లీక్ కావడంతో ఆ పరికరాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ విమానంలో తిరిగి భూమి పైకి చేరుకోవడం వారికి ప్రమాదకరం. అందుకే సిబ్బంది అంతా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

దీంతో 8 రోజులు అంతరిక్షంలో గడిపాక తిరిగిరావాల్సి ఉండగా.. బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ 286 రోజుల పాటు అక్కడే చిక్కుకున్నారు. అయితే ఈ కాలంలో ఈ ఇద్దరూ కూడా నాసాకు చెందిన ఎక్స్‌పెడిషన్ 72 అనే మిషన్ కు పూర్తి చేశారు. దీంతో పాటు వివిధ దేశాల పరిశోధకులకు సాయం చేస్తూ ఉన్నారు. అంతరిక్షంలో ఇంత కాలం ఒకేసారి గడపడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఒకేరోజు 16 సార్లు సూర్యూడు ఉదయిస్తాడు. దీంతో మానవ శరీరం భూగ్రహంపై ఉన్నట్లు సౌకర్యవంతంగా ఉండదు. నిద్ర పట్టదు, గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో అక్కడ మానవ శరీరం తేలాడుతూ ఉంటుంది. ఈ కారణంగా చిన్న చిన్న పనులు చేయాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవ శరీరం ఎక్కువ కాలం ఆ వాతావరణంలో ఉంటే ఎముకల సాంధ్రత, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు.

అయితే చివరి మార్చి 18, 2025న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ అంతరిక్ష విమానం విజయవంతంగా తీసుకువచ్చింది. ఇప్పుడు డ్రాగన్ విమానంలో సాధారణ జనాలకు అంతరిక్ష ప్రయాణం చేయించేందుకు సిద్ధమవుతోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×