Canadian Prime Minister Justin Trudeau: భారత్, అమెరికా దౌత్య సంబంధాల్లో గత కొంతకాలంగా ప్రతిష్టంబన ఏర్పడింది. ఈ క్రమంలో ఆ రెండు దేశాల అధినేతలు ఇటలీలో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భేటీ అయ్యారు. ఇందులో పలు కీలక అంశాల మీద చర్చించుకున్నారు.
కలిసి పనిచేస్తాం..
ప్రధాన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్, కెనడా దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి తాను పోవడం లేదని, కలిసి పనిచేయడానికి మాత్రం కట్టుమడి ఉన్నామని ట్రూడో స్పష్టం చేశారు. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను తాము పూర్తి చేసుకుంటామన్నారు.
కరచాలనం ఫొటో వైరల్..
ప్రధాని నరేంద్ర మోదీ తాను ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై సంక్షిప్తంగా చర్చించారని కెనడా ప్రధాని కార్యాలయం కూడా పేర్కొంది. ప్రధాని మోదీ తిరిగి ఎన్నిక కావడంతో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించింది.
గతేడాది జులై 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగింది. దీని వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే.