BigTV English

Canada Trudeau Diwali: ‘హిందువులకు రక్షణ కల్పిస్తాం’.. రూటుమార్చిన కెనెడా ప్రధాని

Canada Trudeau Diwali: ‘హిందువులకు రక్షణ కల్పిస్తాం’.. రూటుమార్చిన కెనెడా ప్రధాని

Canada Trudeau Diwali| నిన్నటిదాకా భారతదేశంపై ఘాటుగా విమర్శలు చేసిన కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇప్పుడు ఒక్కసారిగా రూటు మార్చాడు. కెనెడాలోని భారతీయులకు, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులపై కెనెడాలో జరుగుతున్న దాడలు నేపథ్యంలో వారు తమ మతం ఆచరించడానికి పూర్తి భద్రత కల్పిస్తామని అన్నారు.


నవంబర్ 1న దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. “హిందువులు కెనెడా జనాభాలో ఒక ముఖ్య భాగం. కెనెడాలోని హిందువులకు దీపావళి చాలా ప్రత్యేక పండుగ. కెనెడాలో నవంబర్ నెలని హిందూ సంప్రదాయ నెలగా గుర్తిస్తాం. హిందూ సమాజంతో పాటు దీపావళి పండుగ వేడుకలు కెనెడా ప్రభుత్వం కూడా జరుపుకుంటుంది. కెనెడాలో హిందువులు తమ మతాన్ని స్వేచ్ఛగా, గర్వంగా ఆచరించేందుకు వారికి పూర్తి భద్రత ప్రభుత్వం కల్పిస్తుంది. ” అని కెనెడా ప్రధాన మంత్రి ప్రకటన జారీ చేశారు.

భారత మూలాలున్న కెనెడియన్లపై ప్రశంసలు కురిపించిన ప్రధాని ట్రూడో
కెనెడా అభివృద్ధిలో ఇండియన్ కమ్యూనిటి కీలక పాత్ర పోషించిందని ప్రధాని ట్రూడో అన్నారు. భారత మూలాలున్న కళాకారులు, డాక్టర్లు, టీచర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు.. కెనెడా నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. కెనెడాలో వారు సాధించిన విజయాలను దీపావళి సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఒట్టావా నగరం అభివృద్ధి భారతీయులు లేనిదే జరిగేది కాదన్నారు. అందుకే కెనెడా పౌరులందరి తరపున తాను ప్రతి భారతీయుడికి, హిందువులకు, భారత మూలాలున్న కెనెడా వాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, అందరి జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలతో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.


Also Read: భారతీయుల పట్ల వివక్ష.. కెనెడాలో దీపావళి వేడుకలు రద్దు

క్షీణిస్తున్న ఇండియా- కెనెడా సంబంధాలు
గత కొన్ని వారాలుగా ఇండియా కెనెడా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. 2023 సెప్టెంబర్ లో కెనెడా పౌరసత్వం ఉన్న ఖలిస్తానీ సిక్కునాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య భారత ప్రభుత్వమే చేయించిదని, ఇండియన్ గూఢాచారి ఏజెంట్లు, క్రిమినల్ గ్యాంగ్స్ తో కలిసి పనిచేస్తోందని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. పైగా కెనెడాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్య అధికారులందరినీ కెనెడా ప్రభుత్వం తమ దేశం నుంచి తిరిగి పంపించేసింది.

మరోవైపు భారతదేశం కూడా ఇండియాలోని కెనెడా అంబాసిడర్లను తిరిగి పంపించేసింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కెనెడాలోని ఒట్టావా నగరంలో 23 సంవత్సరాలుగా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న హిందువులకు అక్కడి ఎంపీ కెనెడా ప్రధాన ప్రతిపక్ష నేత పియెర్ పొయిలివర్ షాకిచ్చారు. ఈ సంవత్సరం దీపావళి వేడుకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కెనెడాలో సిక్కులు, ఖలిస్తానీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తాజాగా బ్రిటీష్ కొలంబియా రాష్ట్ర ఎన్నికల్లో ఏకంగా 14 మంది పంజాబీ మూలాలున్న కెనెడా పౌరులు విజయం సాధించారు. కెనెడాలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఖలిస్తానీల మద్దుతు అవసరంగా మారింది. మరో సంవత్సరంలో కెనెడాలో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీ ఖలిస్తానీల సంతోషపరిచే పనిలో హిందువులు, భారతీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×