BigTV English

Car Performing Dangerous Stunts : కారుతో యువతి స్టంట్స్.. నలిగిపోయిన ఐదుగురు స్నేహితులు

Car Performing Dangerous Stunts : కారుతో యువతి స్టంట్స్.. నలిగిపోయిన ఐదుగురు స్నేహితులు

Car Performing Dangerous Stunts : కొంతమంది కార్లు, బైకులను అతివేగంగా నడుపుతూ (dangerous driving) వారు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులను ప్రమాదానికి గురయ్యేలా స్టంట్స్ చేస్తుంటారు. ఇలంటి స్టంట్స్ కు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా అమెరికాలో ఓ యువతి ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసి తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతోంది.


కొలరాడో స్ప్రింగ్స్ లోని ఓ మాల్ వెలుపల ఉన్న పార్కింగ్ లో ఓ యువతి SUV కారుతో ప్రమాదకరంగా స్టంట్స్ చేసింది. అనంతరం కారు బోల్తా పడింది. ఈ వీడియోను ఒక నెటిజన్ ఇయాన్ మైల్స్ చియోంగ్ చిత్రీకరించి Xలో షేర్ చేశాడు. ఈ సంఘటన కొలరాడో స్ప్రింగ్స్‌లోని మాల్ పార్కింగ్ స్థలంలో శనివారం రాత్రి జరిగింది. ఐదుగురు వ్యక్తులు కిటికీలోంచి, సన్‌రూఫ్‌లోంచి వేలాడుతూ ఉండగా.. వీడియోలో బ్లాక్ SUV అత్యంత వేగంతో రివర్స్ అవుతూ కనిపించింది. యువతి స్టంట్స్ చేస్తుండగా కారు బోల్తా పడటంతో.. ఐదుగురు వ్యక్తులు కారు కింద నలిగిపోయారు.

ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న చుట్టుపక్కలవారు బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఒక వ్యక్తి తీసుకువెళ్లగా, మరికొందరు దాని కింద చిక్కుకున్న బాధితుల నుండి కారును పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు స్పందించారు. “వాహనం కిటికీలకు వేలాడుతున్న వ్యక్తులపై బోల్తా పడింది” అని వారు చెప్పారు. పోలీసులు డ్రైవర్‌ను మరిసోల్ వెంట్లింగ్‌గా గుర్తించి అమెను అరెస్టు చేశారు. ఆమె నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని అభియోగాలు మోపారు. డ్రైవింగ్ చేసున్న యువతికి స్వల్ప గాయాలు కాగా, కింద పడినవాళ్లకి తీవ్రగాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.


ఇప్పటి వరకు జరిగిన విచారణ ఆధారంగా, పార్కింగ్ స్థలంలో స్టంట్స్ చేయడానికి ప్రత్యేకంగా మాల్‌లో ప్రేక్షకులు కలిశారని పోలీసులు భావిస్తున్నారు.దీనిపై మరింత సమాచారం తెలిసిన వారు ఎవరైనా ముందుకు వచ్చి వివరాలు చెప్పాల్సిందిగా పోలీసులు కోరారు.

Related News

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Big Stories

×