E-Paper
Advertisement

Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. కాలువలో పడి పసివాడు మృతి..

Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. కాలువలో పడి పసివాడు మృతి..
Advertisement

Kamareddy : బడికి వెళ్ళాను అని మారం చేసే చిన్న పిల్లలను తల్లిదండ్రులు బుజ్జగించి బడికి పంపుతారు. బడి నుంచి ఇంటికి వచ్చే సమయానికి పిల్లల కోసం తల్లులు గుమ్మం దగ్గర ఎదురు చుస్తూ కుర్చుంటారు. అలాంటి తల్లికి తన కుమాారుడు తిరిగి రాకపోతే ఎంతో విలవిలలాడి పోతుంది. ఇలాంటి ఘటన ఓ తల్లికి ఎదురుయ్యింది.తన కుమారుడిని చక్కగా ముస్తాబు చేసి బడికి పంపించింది.చిరునవ్వుతో రావాలసిన ఆ బాబు శవమై వచ్చాడు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాదిలో విషాద ఘటన చోటు చేసుకుంటుంది. బడి వద్ద ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఓ విద్యార్థి కాలువలో పడి మృతి చెందాడు . కొత్తబాది ప్రాథమిక పాఠశాలలో ఫర్హాన్‌ (6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో బయటకు వచ్చాడు.

Advertisement

కాలు జారి పక్కనే ఉన్న కాలువలో పడ్డాడు. వెంటనే తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లి అసిఫాకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఫర్హాన్‌ను వెంటనే కాలువ నుంచి బయటికి తీసి.. బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఫర్హాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఫర్హాన్ బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో పాఠశాలకు ప్రహరీ ఉండగా పక్కన ఉన్న ప్రాథమిక సహకార సంఘం గోదాం నిర్మాణం కోసం దాన్ని తొలగించారు. గుత్తేదారు ప్రహరీ గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ నిర్మించలేదని స్థానికులు మండిపడ్డారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×