BigTV English

Star Wars bikini| వేలంపాటలో ఆ నటి ధరించిన బికినీ రూ.కోటి 50 లక్షలు.. ఆ బికినీలో ఏముందంటే..

Star Wars bikini| వేలంపాటలో ఆ నటి ధరించిన బికినీ రూ.కోటి 50 లక్షలు.. ఆ బికినీలో ఏముందంటే..

Carrie Fisher’s Star Wars bikini | ఈ ప్రపంచంలో ఏ వస్తువు ధర ఎప్పుడు ఆకాశానంటుందో చెప్పలేం. సాధారణంగా ఒక బికినీ (మహిళల స్వీమింగ్ దుస్తులు) ధర రూ.200, పెద్ద బ్రాండ్ అయితే రూ.1000 ఉంటుంది. కానీ ఒక బికినీ ధర రూ.1.46 కోట్లు పలికింది. ఇది మార్కెట్లో లభించే సాధారణ బికినీ కాదండోయ్.. ఈ బికినీ ఇంత ధర పలకడానికి ఒక కారణం కాదు.. ఒక కథే ఉంది.


స్పెషల్ బికినీ ఎందుకంటే?
హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ లో నటించిన పాపులర్ నటి కేరీ ఫిషర్ ధరించిన బికినీ ఇది. ఈ బికినీ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ బికినీ తయారు చేయడానికి బంగారం ఉపయోగించారు. స్టార్ వార్స్ సినిమాలో ప్రిన్సెస్ లియా పాత్ర పోషించినప్పుడు ఆమె ఈ బికినీని ధరించారు. స్టార్ వార్స్ సినిమాల ఒక ఫ్రాంచైజీ ఉంది. ఈ ఫ్రాంచైజీలోని 1983లో విడుదలైన ‘స్టార్ వార్స్ రిటర్న్ ఆఫ్ ది జెడై’ సినిమాలో ఆమె ఒక సీన్ లో ఈ బికినీలో కనిపిస్తారు. అయితే ఆ సీన్ లో మనిషి కంటే నాలుగు రెట్లు పెద్ద ఆకారంగల ఒక భారీ ఊసరవెల్లి.. పేరు ‘జబ్బా ది హట్’ వద్ద బందీగా.. అతనికి సెక్స్ స్లేవ్ గా ప్రిన్సెస్ లియా ఉంటుంది. ఆమెను ఆ జబ్బా.. సంకెళ్లలో బంధించినప్పుడు ఆమె ఈ ప్రత్యేక బికినీలో ఉంటుంది.

ఈ బికినీలో మొత్తం ఏడు వస్త్రాలున్నాయి. ఇందులో సాధారణంగా ఉండే బికినీ బ్రెసియర్ తో పాటు, బికినీ ప్లేట్, హిప్ రింగ్, భుజానికి, చేతికి ధరించే కడియాలున్నాయి. ఈ బికినీని డిజైన్ చేసింది.. ప్రముఖ లైట్ అండ్ మ్యాజిక్ డిజైనర్ రిచర్డ్ మిల్లర్.


ఇటీవలే బ్లాక్ బాస్టర్ హాలీవుడ్ సినిమాల్లోని ఐకానిక్ వస్తువల వేలం జరిగింది. ఈ వేలం పాటలో ఈ బికినీ 1,75,000 డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ.1 కోటి 46 లక్షల) ధర పలికింది. ఈ బికినీతో పాటు హ్యారీ పాటర్ సినిమాలోని మ్యాజిక్ వాండ్, స్టార్ ట్రెక్ సినిమా పోస్టర్ లన్నీ కలిపి వేలంలో 5.9 మిలియన్ డాలర్లు వచ్చాయి.

ఆ బికినీ ధరించేందుకు ఇష్టపడని నటి
స్టార్ వార్స్ అభిమానులను ఆకట్టుకున్న ఈ బికినీని ధరించేందుకు నటి కేరీ ఫిషర్ అసలు ఇష్టపడలేదట. 2016లో ఆమె ఒక ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. ”నాకు ఈ సినిమాలో ఈ బికినీ ధరించాలని డైరెక్టర్ చెప్పినప్పుడు.. ఏదో సరదా కోసం చెప్పారనుకున్నాను. కానీ ఆయన సీరియస్ గా చెప్పారని తెలియగానే నేను షాకయ్యాను. అంత చిన్న దుస్తులలో నేను అందరి ముందు నటించడం.. నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. ఆ తరువాత ఆ బికినీలో కొన్ని వస్త్రాలు జోడించి మార్పులు చేశారు,” అని ఆమె అన్నారు. నటి కేరీ షిషర్ ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు. కానీ ఆమె జ్ఞాపకంగా ఈ బికినీ ఉంది.

Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×