Rocking Rakesh : రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన కొంత మేరకు చాలా ఈజీగా కొందరికి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటులుగా, దర్శకులుగా నిలబడాలి అంటే చాలా కష్టపడాలి. కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని కూడా చెప్పలేము. ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా కొందరు హీరోలకి హిట్ సినిమాలు కూడా పడట్లేదు. ఏదేమైనా బ్యాక్ గ్రౌండ్ అనేది కూడా కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీలో ఎవరి కెరియర్ అయినా డిసైడ్ చేయగలిగే సత్తా కేవలం ఒకరికే ఉంది. అది ప్రేక్షకులకి. ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పవాళ్ళు. ఆ ప్రేక్షకులే సామాన్య నటుడుని శిఖర స్థాయికి తీసుకెళ్తారు. అదే ప్రేక్షకులు ఒక సినిమా బాగోకపోతే అటువైపు కూడా చూడరు.
ఒక సినిమా అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. అలానే ఏ సినిమా ఎవరికి నచ్చుతుందో ఎవరు ఊహించలేరు. ఒకవేళ ఇలాంటి సినిమాలు నచ్చుతాయి అని క్లారిటీ దర్శకులకు ఉంటే అలాంటి సినిమాలే తీస్తారు. సో ఏదేమైనా కూడా తుది నిర్ణయం అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అలాంటి ఆడియన్స్ ని చాలామంది సీనియర్ హీరోలు అంతా కూడా ప్రేక్షకు దేవుళ్ళు అంటూ కొనియాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ ని ప్రాంక్ పేరుతో పిచ్చోళ్లను చేస్తున్నారు. ప్రాంక్ వీడియో చేయడం కూడా పెద్ద నేరం కాదు. కానీ అది శృతిమించకూడదు. ఏకంగా ఐటీ దాడులు చేయించారు అంటూ వీడియోను పోస్ట్ చేయడం అనేది మితిమీరిన తనమని చెప్పాలి. ఇన్ కమ్ ట్యాక్స్ అనే పేరు ను సినిమా ప్రమోషన్స్ కు, ఇంటర్వ్యూస్ కి మిస్ యూజ్ చేస్తున్నారు.
జబర్దస్త్ తో మంచి గుర్తింపు సాధించుకున్న రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో కనిపించి నిర్మించిన సినిమా కెసిఆర్. కెసిఆర్ అంటే కేశవ చంద్ర రామవత్.కానీ ఇది పెద్దగా ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ టైటిల్ ని కెసిఆర్ అంటూనే ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లాడు రాకేష్. సినిమాకి కూడా రాజకీయ రంగును అంటించాడు. ఇకపోతే ఈ సినిమా విషయంలో కూడా ప్రమోట్ చేస్తూ కొంతమేరకు బీఆర్ఎస్ నేతలను కూడా ట్విట్టర్ వేదికగా మెన్షన్ చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు రాకింగ్ రాకేష్ ఇంట్లో ఐటీ దాడులు అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో కు తీవ్రమైన నెగెటివిటీ వస్తుంది.
Also Read : Robinhood Movie: ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్.. అదే సస్పెన్స్ అంటున్న డైరెక్టర్
ఇక ఈ వీడియో విషయానికి వస్తే బేసిక్ సెన్స్ లేకుండా చేశారు అని చెప్పాలి. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు ఎప్పుడు కూడా వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ కు ఇవ్వరు. ఒకవేళ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వీడియో తీసుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కోసం మాత్రమే వీడియో తీసుకుంటారు. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా అంటూ కొంతమంది కామెంట్స్ మొదలుపెట్టారు. ఇక వీడియోలో కనిపించిన వాళ్లను చూస్తుంటే ఎవరు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ లా లేరు. ఇన్కమ్ లేక ఆర్టిస్టులు అయినట్టున్నారు. ఐటీ రైడ్ చేసేవాళ్ళు రావడమే సంబంధిత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, పోలీసులు ఐటి వాళ్ళు కలిసే వస్తారు. వీడియోలు తీయరు, తీసిన వీడియోలు ఇలా పబ్లిష్ చేయరు. అని కామెంట్ సెన్స్ కూడా లేకుండా ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడంతో రాకింగ్ రాకేష్ పై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.సినిమా టైటిల్ కాస్త కాంట్రవర్సీ తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది పోయి… తానే స్వతహగా కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నాడు.