Lightest brain chip: ఇదేమో పగలు వెలిగించే లైటు కాదు… కానీ తేనెటీగల మనసుని వెలిగించే టెక్నాలజీ. అవును… వింటే ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది నిజం. చైనా శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసేలా ఓ అద్భుతమైన బ్రెయిన్ చిప్‌ని రూపొందించారు. దీని బరువు ఎంతంటే? కేవలం 74 మిల్లీగ్రాములు! బరువు తక్కువ… పనితీరు మామూలుగా లేదు. ఎందుకంటే ఇది తేనెటీగల తలపై అమర్చగలిగేంత చిన్నదిగా, మెదడు పనితీరును ప్రభావితం చేసేంత శక్తివంతంగా ఉంటుంది.
తేనెటీగలని డైరెక్ట్‌గా నడిపించవచ్చంట!
ఈ చిన్న చిప్ తేనెటీగల శరీరంపై అమర్చితే, వాటిని ఎటు వెళ్లాలో, ఎప్పుడెక్కడ ఆగాలో చెప్పగలుగుతారు. ఇంకేం కావాలి? గాలిలో తేలుతూ తిరిగే తేనెటీగలు ఇప్పుడు మన చేతుల్లో ఉన్న జీపీఎస్ లా మారిపోతున్నాయి. దీని ద్వారా శాస్త్రవేత్తలు వాటి ప్రవర్తనను కంట్రోల్ చేయడమే కాదు, పర్యావరణ పరిస్థితులపై సమాచారం సేకరించగలుగుతున్నారు. అంటే తేనెటీగల కళ్లతో ప్రపంచాన్ని చూడగలిగే పరిస్థితి వస్తోంది.
ఈ చిప్ లో దాగున్న మాయ ఏంటి?
ఈ మినీ బ్రెయిన్ చిప్‌లో ఓ చిన్న ప్రాసెసర్, డేటా ట్రాన్స్మిటర్, పవర్ సోర్స్, చిన్న సైజు యాంటెనా వంటివన్నీ దాగున్నాయి. తేనెటీగలు ఎగిరే సమయంలో అసలు తలనొప్పిగా మారకుండా, అడ్డంకిగా అనిపించకుండా అద్భుతంగా పని చేస్తోంది. ముఖ్యంగా తేనెటీగల ప్రాణానికి ఎలాంటి హానీ కలగకుండా టెస్టింగ్ జరిపి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
ఎందుకు చేస్తున్నారు ఈ ప్రయోగం?
ఇది శుద్ధంగా ప్రకృతిని తెలుసుకోవడానికే. తేనెటీగలతో వాతావరణ మార్పులు, గాలి నాణ్యత, పంటలపై ఎఫెక్ట్ ఎలా ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. పల్లెల్లో, పర్వతాలలో, అడవుల్లో మానవులు వెళ్లలేని చోట్ల తేనెటీగలు చక్కగా వెళ్లి సమాచారం తెచ్చేస్తాయి. దీనిని BioBot అని పిలుస్తున్నారు.. అంటే జీవుల్ని ఆధారంగా చేసుకున్న రోబోలా.
భవిష్యత్‌లో మానవులు కూడా..?
ఇప్పుడు తేనెటీగలు.. రేపు పక్షులు.. ఇంకా తరువాత మనుషులు? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు.. వాస్తవం కావొచ్చు. న్యూరోచిప్, మైక్రో కంట్రోలర్, బ్రెయిన్ హ్యాకింగ్ వంటివి ఇప్పటికే పరిశోధనల్లో ఉన్నాయి కాబట్టి, ఈ రకమైన టెక్నాలజీ భవిష్యత్‌లో ఎంతవరకు పోతుందో చెప్పలేం. అందుకే శాస్త్రవేత్తలు ఎంతో జాగ్రత్తగా, నియంత్రణతో ప్రయోగాలు చేస్తున్నారు.
టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా అవసరం
ఇలాంటి టెక్నాలజీ నిజంగా అద్భుతంగా ఉంటుంది. కానీ అదే టైమ్‌లో ఇది చాలా బాధ్యతను కూడా కోరుతుంది. ఒకవేళ చెడు చేతుల్లో పడితే.. తేనెటీగలు కాదు.. మనల్ని నియంత్రించడానికే వాడవచ్చు. అందుకే టెక్నాలజీ ఎంత గొప్పదైనా దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది.
చిన్నదే కానీ ప్రపంచాన్ని చుట్టేస్తుంది!
చిన్న చిప్ పెద్ద మార్పుకు నాంది పలికింది. తేనెటీగల్ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ BioBots ద్వారా పర్యావరణ మార్పులపై ఆధారపడే రిసెర్చ్‌లు ఊపందుకుంటున్నాయి. రైతులకు, శాస్త్రవేత్తలకు, పర్యావరణ శ్రేణులకు ఇది బాగా ఉపయోగపడే ఆవిష్కరణ. ఇది సైంటిఫిక్ విజ్ఞానానికి చైనా ఇచ్చిన మరో పెద్ద కానుక అనే చెప్పాలి.