BigTV English

China’s deepest well : చైనా తవ్విన ఈ బావి లోతు 11 కి.మీ – ఎందుకు తవ్వారో తెలుసా?

China’s deepest well : చైనా తవ్విన ఈ బావి లోతు 11 కి.మీ – ఎందుకు తవ్వారో తెలుసా?

China’s deepest well : చైనా నేషనల్ పెట్రోలియం కార్పోరేషన్ ఆసియాలోనే అత్యంత లోతైన బావి డ్రిల్లింగ్‌ను పూర్తి చేసింది. చైనా వాయువ్య ఎడారిలోని ఓ ప్రదేశంలో భారీ డ్రిల్లింగ్ చేపట్టిన చైనా.. సుదీర్ఘ సమయం పాటు తవ్వి 10,910 మీటర్ల లోతుకు బోర్‌హోల్ చేరుకుందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది. “షెండిటేక్ 1” అని పిలిస్తున్న ఈ బావిని శాస్త్రీయ పరిశోధన కోసం తవ్వుతున్నట్లుగా చైనా ప్రకటించింది. భూమి పొరల్లోని విలువైన చమురు, గ్యాస్ వనరులతో పాటు భూమి పరిణామం క్రమాన్ని అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అలాగే.. లోతైన భూమి భూగర్భ శాస్త్ర అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బావి ఉపయోగపడుతుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు.


చైనా తవ్వని ఈ లోతైన బావి, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బావి. కాగా.. దీని కంటే కాస్త ఎక్కువ లోతుగా రష్యాలో బోర్ వెల్ తవ్వారు. ఈ తవ్వకం ద్వారా.. ఇంజినీరింగ్ లోని అనేక ఆధునిక పద్ధతుల్ని పరిశీలించినట్లు తెలిపిన పరిశోధకులు.. లోతైన లైనర్ సిమెంటింగ్, లోతులో వైర్‌లైన్ ఇమేజింగ్ లాగింగ్, 10,000 మీటర్లను దాటిన వేగవంతమైన ఆన్‌షోర్ డ్రిల్లింగ్ వంటి విభాగాల్లో అత్యుత్తమ విధానాలను పరిశీలించినట్లుగా వెల్లడించారు.

ఈ డ్రిల్లింగ్ కోసం చైనీస్ అకాడమీ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్, అనేక విశ్వవిద్యాలయాలు, కంపెనీలతో కలిసి అభివృద్ధి చేసిన ప్రత్యేక రిగ్ ద్వారా ఈ డ్రిల్లింగ్ నిర్వహించారు. “డీప్ ఎర్త్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగాప్రాజెక్ట్”గా పేరు పేరుపెట్టినట్లు అక్కడి మీడియా తెలిపింది. మే 30, 2023న డ్రిల్లింగ్ ప్రారంభించగా.. మొదటి 10,000 మీటర్లు అంటే పది కిలోమీటర్లను 279 రోజుల్లో పూర్తి చేశారు. కానీ.. చివరి 1,000 మీటర్ల డ్రిల్లింగ్ చేసేందుకు 300 రోజులకు పైగా సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. ఈ లోతులో తవ్వకాలు చేపట్టినప్పుడు.. ఆ ప్రాంతంలోని క్రియాశీల చమురు, గ్యాస్ ఉనికి బయటపడినట్లు చైనా మీడియా గ్రూప్ వెల్లడించింది. ఇంతలోతులో.. ప్రతీ మీటరు తవ్వకానికి ఎన్నో ప్రత్యేక సవాళ్లను ఎదుర్కున్నట్లు పరిశోధకులు తెలిపారు.


ఈ ప్రాజెక్టులో పరిశోధకులు అనేక అడ్డంకులు ఎదుర్కొన్నారని తెలిపిన స్థానిక మీడియా.. భారీ లోడ్లు, బావి బోర్ అస్థిరతతో పాటుగా మధ్యలో పరికరాల వైఫల్యాలు, నిర్మాణ నష్టాలతో అనేక అడ్డంకులను బృందం అధిగమించిందని ఈ బృందానికి నేతృత్వం వహించిన వాంగ్ తెలిపారు. డ్రిల్లింగ్ తారిమ్ బేసిన్ లోని 12 భౌగోళిక నిర్మాణాల ద్వారా విజయవంతంగా వెళ్ళిందని.. ఇందులో, చివరికి 10,851 నుంచి 10,910 మీటర్ల మధ్య అధిక-నాణ్యత చమురు, గ్యాస్ ను ఉత్పత్తి చేసే రాతి నిర్మాణాలను కనుక్కున్నట్లు తెలిపారు.

Also Read : Air India Service : విమానంలో కేంద్ర మంత్రికి విరిగిపోయిన సీటు – తర్వాత ఏమైందో తెలుసా.?

చైనా కంటే ముందు ప్రపంచంలోనే రష్యాలో ఇలాంటి లోతైన బావిని తవ్వారు. ఇది “కొలా సూపర్‌దీప్ బోర్‌హోల్” (Kola Superdeep Borehole) గా ప్రసిద్ధి పొందింది. దీనిని 12,262 మీటర్లు (సుమారు 12.2 కి.మీ) తవ్వారు. ఈ ప్రాజెక్టును 1970లో రష్యా చేపట్టింది. భూమిలోని భూగర్భ పొరలను, వాటి నిర్మాణాన్ని, భూకంప వ్యవస్థలను అధ్యయనం చేయడానికి ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. కాగా.. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో మనుషులు తవ్విన అత్యంత లోతైన బావిగా రికార్డులకెక్కింది. భూమి లోపల అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా దీని తవ్వకాలని 1994లో నిలిపివేశారు. భూమి లోపల ఈ లోతులో.. సుమారు 180°C ఉష్ణోగ్రతలు ఎదురైనట్లు పరిశోధకులు తెలిపారు. కాగా.. ఈ బావిలో అనేక భూగర్భ రహస్యాలు బయటపడ్డగా, వాటిలో 2.7 బిలియన్ సంవత్సరాల పురాతన రాళ్లు అవశేషాల్ని పరిశోధకులు గుర్తించారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×