Satya Shri:ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది నటీనటులు తమకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకుని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ.. హీరోలుగా, హీరోయిన్లుగా సెటిల్ అవుతున్నారు. ఇంకొంతమంది కమెడియన్లుగా, డైరెక్టర్లుగా కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రముఖ నటి సత్య శ్రీ (Satya Shri)కూడా ఒకరు. ఈమె తల్లి కూడా గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది
ఎవరినీ ఇష్టపడలేదు..
సత్య శ్రీ తన తల్లి ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇకపోతే తరచూ నెట్టింట వరుస ఫోటోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉండే ఈమె, తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయం గురించి తెలిపి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ప్రేమ గురించి ప్రశ్నించగా సత్య శ్రీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు అంటూ తెలిపింది సత్య శ్రీ. తనకు చాలామంది ప్రపోజ్ చేశారట కానీ తాను మాత్రం ఎవరి లవ్ యాక్సెప్ట్ చేయలేదని తెలిపింది. డైరెక్టుగా ఏ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయలేదని, ఫ్రెండ్స్ ద్వారానే తమ ప్రేమ విషయాన్ని చెప్పించేవారు అంటూ తెలిపింది. అంతే కాదు ఇంట్లో వాళ్ళు లవ్ యాక్సెప్ట్ చేయరని, కానీ ఒక అబ్బాయి ధైర్యం చేసి మరీ తన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశారని, అయితే తాను నో చెప్పానని, అయినా సరే ఆ అబ్బాయి మళ్లీ మళ్లీ వెంటపడేవాడు అంటూ కూడా వెల్లడించింది సత్య శ్రీ.
మా నాన్న చేసిన పనికి లవ్ అంటే భయమేస్తుంది..
సత్య శ్రీ మాట్లాడుతూ.. ఆ అబ్బాయి నాతో ఒకరోజు మాట్లాడుతూ ఉంటే.. మా నాన్న ,బాబాయ్ చూశారు. ఆ తర్వాత అబ్బాయిని విపరీతంగా కొట్టారు. మరుసటి రోజు కట్లతో కనిపించాక, నాన్న దగ్గరకు వెళ్లి అడిగితే.. అవును కొట్టించాను అయితే ఏంటి ? అన్నారు. ఇకప్పటినుంచి లవ్ అంటూ అబ్బాయి ఎప్పుడు కూడా నా చుట్టూ తిరగలేదు. ఇక ప్రస్తుతం ఇప్పటికీ నేను ఒంటరిగానే ఉన్నాను అంటూ సత్యశ్రీ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నువ్వేదో సినిమా స్టోరీ చెబుతున్నట్టు ఉంది అని మేము అనుకుంటున్నాం అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సత్యశ్రీ తన లవ్ విషయంపై కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది
సత్య శ్రీ కెరియర్..
సత్య శ్రీ విషయానికి వస్తే.. ఎక్కువగా చమ్మక్ చంద్ర టీం లో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర భార్యగా ఎన్నో స్కిట్లు చేసిన ఈమె, ఆ తర్వాత జబర్దస్త్ నుండి చమ్మక్ చంద్ర వెళ్ళిపోవడంతో ఈమె కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది సత్యశ్రీ. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది.